బైజూస్‌ మరో రికార్డు 

Tiger Global invests usd 200 million in BYJUS - Sakshi

బైజూస్‌లో టైగర్‌ గ్లోబల్‌ భారీ పెట్టుబడులు

3వ అత్యంత విలువైన స్టార్టప్‌గా బైజూస్‌

సాక్షి, ముంబై: 4 కోట్ల  రికార్డు డౌన్‌లోడ్లతో దూసుకుపోతున్న ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ బైజూస్‌ తాజాగా భారీ పెట్టుబడులను సాధించింది. న్యూయార్క్ కేంద్రంగా ఉన్న హెడ్జ్ ఫండ్ సంస్థ టైగర్ గ్లోబల్  నుంచి 200 డాలర్లను పెట్టుబడులను కొట్టేసింది. ఈ విషయాన్ని స్వయంగా  ఆన్ లైన్ లెర్నింగ్ యాప్ బైజూస్ వ్యవస్థాపకుడు సీఈవో రవీంద్రన్  ప్రకటించారు. దీంతో బెంగళూరుకేంద్రంగా పనిచేస్తున్న బైజూస్‌ వాల్యూ  8 బిలియన్ల డాలర్లు మించిపోతుందని మార్కెట్‌ విశ్లేషకులు  భావిస్తున్నారు.  దీనితో 2015 లో స్థాపించబడిన బైజూస్ భారతదేశంలో మూడవ అత్యంత విలువైన స్టార్టప్‌గా అవతరించింది.

టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ వంటి బలమైన పెట్టుబడిదారుడితో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని బైజూస్‌ సీఈవో తెలిపారు. విద్యార్థులు నేర్చుకునే విధానంలో పలుమార్పులు తీసుకురావాలన్న తమ దీర్ఘకాలిక దృష్టికి, ఆవిష్కరణలకు మరో అడుగు ముందుకు పడినట్టు రవీంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. టైర్ 2, 3 నగరాల్లో అభ్యాసకులకు అందుబాటులో ఉండేలా మాతృభాషలో తమ ప్రోగ్రామ్‌లను ప్రారంభించటానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.  అంతేకాదు రాబోయే నెలల్లో ఆన్‌లైన్  పాఠాలకోసం  ఒక స్టార్ట్-అప్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపారు.  గత 12 నెలల్లో, గ్రామీణ, పట్టణాల్లో 42 మిలియన్ల రిజిస్టర్డ్ యూజర్లు, 3 మిలియన్ల చెల్లింపు చందాదారులు తమ యాప్‌లో ఉన్నారని పేర్కొన్నారు. అలాగే సంస్థ ప్రకారం, ఒక విద్యార్థి అనువర్తనంలో గడిపే సగటు నిమిషాల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే రోజుకు 64 నిమిషాల నుండి 71 నిమిషాలకు పెరిగింది. వార్షిక  సభ్యత్వాల రెన్యూవల్‌ రేట్లు 85శాతం పుంజుకుంది. మరోవైపు భారతదేశంలో మిలియన్ల మంది పాఠశాల విద్యార్థుల మన్ననలు పొందుతూ,  విద్య-సాంకేతిక రంగంలో అగ్రగామిగా ఉన్న బైజూస్‌ బృందానికి మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందని  టైగర్ గ్లోబల్ భాగస్వామి స్కాట్ ష్లీఫర్ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top