ఫోక్స్‌వ్యాగన్ బీటిల్.. కొత్త వేరియంట్ | The New variant Volkswagen Beetle | Sakshi
Sakshi News home page

ఫోక్స్‌వ్యాగన్ బీటిల్.. కొత్త వేరియంట్

Dec 19 2015 12:00 AM | Updated on Sep 3 2017 2:12 PM

ఫోక్స్‌వ్యాగన్ బీటిల్.. కొత్త వేరియంట్

ఫోక్స్‌వ్యాగన్ బీటిల్.. కొత్త వేరియంట్

జర్మనీ కార్ల కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ బీటిల్ కారులో కొత్త వేరియంట్, ట్వంటీఫస్ట్ సెంచురీ బీటిల్‌ను శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది.

ధర రూ.28.73 లక్షలు
న్యూఢిల్లీ:
జర్మనీ కార్ల కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ బీటిల్ కారులో కొత్త వేరియంట్, ట్వంటీఫస్ట్ సెంచురీ బీటిల్‌ను శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది. ధర రూ.28.73 లక్షలు(ఎక్స్ షోరూమ్, ముంబై). బీటిల్ కారు తమ బ్రాండ్లలో ముఖ్యమైనదని, అరవై ఏళ్లుగా వినియోగదారుల ఆదరణ పొందుతోందని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ డెరైక్టర్ మైఖేల్ మేయర్ చెప్పారు. 1.4 లీటర్ నాలుగు సిలిండర్ల టీఎస్‌ఐ పెట్రోల్ ఇంజిన్‌తో రూపొందిన ఈ కారులో  7-స్పీడ్ డీఎస్‌జీ గేర్‌బాక్స్, రియర్ స్పాయిలర్, ఎలక్ట్రోమెకానికల్ స్పీడ్-సెన్సిటివ్ పవర్ స్టీరింగ్, లెదర్ సీట్లు,  డ్యుయల్-జోన్ ఆటో ఎయిర్-కండీషనింగ్ సిస్టమ్, ఎనిమిది స్పీకర్లతో కూడిన సౌండ్ సిస్టమ్, ఆటో హెడ్‌ల్యాంప్ యాక్టివేషన్, క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలున్నాయని మేయర్ చెప్పారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement