లాభనష్టాల ఊగిసలాట | stockmarkets slips intovolatile | Sakshi
Sakshi News home page

లాభనష్టాల ఊగిసలాట

Jul 15 2019 1:10 PM | Updated on Jul 15 2019 1:13 PM

stockmarkets slips intovolatile - Sakshi

సాక్షి,ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన అనంతరం నష్టాల్లోకి జారుకున్నాయి. వెంటనే తేరుకుని స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి.  సెన్సెక్స్‌ 43 పాయింట్లు ఎగిసి 38779 వద్ద, నిప్టీ 4 పాయింట్ల నామమాత్రపు లాభాలతో  11558 వద్ద కొనసాగుతోంది. ఇన్ఫోసిస్, యెస్ బ్యాంక్, సన్ ఫార్మా, బజాజ్  ఫైనాన్స్, గ్రాసిమ్  షేర్లు టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.  ఇన్ఫోసిస్‌ రికార్డు స్థాయిని తాకింది. అటు ఫలితాల బూస్ట్‌తో అవెన్యూ సూపర్‌ మార్కెట్ కూడా లాభపడుతోంది. మరోవైపు  ఇండియా బుల్స్, వేదాంత, జీ ఎంటర్‌టైన్మెంట్ , టైటాన్ కంపెనీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌  ఏకంగా 27శాతం పతనమైంది. 

Advertisement
 
Advertisement
Advertisement