మార్కెట్లకు సెలవు | Stockmarkets remains closed today   | Sakshi
Sakshi News home page

మార్కెట్లకు సెలవు

Aug 12 2019 9:24 AM | Updated on Aug 12 2019 9:26 AM

Stockmarkets remains closed today   - Sakshi

సాక్షి,. ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లకు ఈ రోజు సెలవు. బక్రీద్‌ సందర్భంగా 12న(సోమవారం) స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సెలవు ప్రకటించారు.  సాక్షి పాఠకులకు బక్రీద్‌ పర్వదినంగా సందర్భంగా ఈద్‌ శుభాకాంక్షలు.

అలాగే ఈ వారం  మార్కెట్లలో ట్రేడింగ్‌ మూడు రోజులకే పరిమితంకానుంది. ఆగస్టు 15  స్వతంత్ర దినోత్సవం  సందర్భంగా గురువారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ పనిచేయవు. దీంతో వారంలో  ట్రేడింగ్‌ మంగళ, బుధ, శుక్రవారాలకే పరిమితంకానుంది కాగా  అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదరడంతో గత వారంలో తొలి మూడు రోజులూ  దేశీయంగా, అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లు  నష్టాలపాలయ్యాయి.  దేశీయంగా రిలీఫ్‌ ర్యాలీ వచ్చినప్పటికీ , సెంటిమెంటు బలహీనంగా ఉందనీ, అప్రమత్తత అవసరంమని నిపుణులు చెబుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement