ప్రారంభ సెషన్లో సెన్సెక్స్ శుభారంభం | Sensex gains 64 points in early session | Sakshi
Sakshi News home page

ప్రారంభ సెషన్లో సెన్సెక్స్ శుభారంభం

Jul 10 2014 10:15 AM | Updated on Mar 29 2019 9:04 PM

ప్రారంభ సెషన్లో సెన్సెక్స్ శుభారంభం - Sakshi

ప్రారంభ సెషన్లో సెన్సెక్స్ శుభారంభం

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతుండటంతో.. స్టాక్ మార్కెట్లు ప్రారంభ సెషన్లో సానుకూలంగా స్పందించాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతుండటంతో.. స్టాక్ మార్కెట్లు ప్రారంభ సెషన్లో సానుకూలంగా స్పందించాయి. భారతీయ ఈక్విటీ మార్కెట్ల పరిస్థితిని చూపించే ప్రధాన సూచీ సెన్సెక్స్ 64.08 పాయింట్లు పుంజుకుంది. ఆటోమొబైల్ షేర్లు పెరగడం మొదలుపెట్టాయి. ప్రధానంగా ఆటోమొబైల్, కేపిటల్ గూడ్స్, వినియోగదారుల వస్తువుల రంగాల్లో కొనుగోళ్లు బాగా కనిపించాయి.

ఆరోగ్యరంగంలో మాత్రం అమ్మకాల ప్రభావం గట్టిగా ఉంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్ఈ) సెన్సెక్స్ 25,513.74 పాయింట్ల వద్ద ప్రారంభమై, ఉదయం 9.15 ప్రాంతానికి ప్రారంభ సెషన్లో 25,508.89 వద్ద ట్రేడవుతోంది. గురువారం నాటి ముగింపు అయిన 25,444.81 కంటే ఇది 64.08 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ మాత్రం పెద్దగా స్పందించడంలేదు. కేవలం 0.90 పాయింట్లు మాత్రమే పెరిగి, 7,585.90 వద్ద ట్రేడవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement