బల్క్‌ డిపాజిట్‌ రేట్లకు రెక్కలు! | SBI raises one percent | Sakshi
Sakshi News home page

బల్క్‌ డిపాజిట్‌ రేట్లకు రెక్కలు!

Dec 1 2017 1:28 AM | Updated on Dec 1 2017 1:28 AM

SBI raises one percent - Sakshi


 ఒక శాతం పెంచిన ఎస్‌బీఐ
 పీఎన్‌బీ అరశాతం పెంపు  
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని రెండు అతిపెద్ద బ్యాంకులు పలు రకాల డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచుతూ అనూహ్య నిర్ణయం ప్రకటించాయి. ఎస్‌బీఐ రూ.కోటి దాటిన అన్ని డిపాజిట్లపై వడ్డీ రేటును ఒక శాతం పెంచింది. రూ. కోటిలోపున్న వాటిపై రేటులో మార్పు లేదు. 7–45 రోజుల కాల వ్యవధి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేటు 3.75 శాతం నుంచి 4.75 శాతానికి చేరుకుంది. అలాగే, 5–10 ఏళ్ల కాల వ్యవధి కలిగిన డిపాజిట్లపై ఈ రేటు 4.25 శాతం నుంచి 5.25 శాతానికి పెరిగింది. పీఎన్‌బీ సైతం ఎస్‌బీఐ బాటలోనే నడుస్తూ రూ.కోటి దాటిన బల్క్‌ డిపాజిట్లపై అదనంగా అర శాతం వడ్డీని ఆఫర్‌ చేసింది. 4.50 శాతం నుంచి 5 శాతానికి పెంచింది. వచ్చే నెల 6న ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమీక్షా సమావేశం నేపథ్యంలో తాజా సవరణలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఈ కొత్త రేట్లు డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement