
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ).. రుణాలకు సంబంధించి ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత వడ్డీ రేట్లను (ఈబీఆర్) 25 బేసిస్ పాయింట్ల (పావు శాతం) మేర తగ్గించింది. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఎస్‌బీఐ తెలిపింది. కొత్త కస్టమర్లకు గృహ రుణాలపై వడ్డీ రేటు 7.90 శాతం నుంచి ఉంటుంది. ఇప్పటిదాకా ఇది 8.15 శాతంగా ఉంది. మరోవైపు, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ (ఎంసీఎల్‌ఆర్) విధానం ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లను జనవరి 3 నుంచి సవరిస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్ వెల్లడించింది. వివిధ కాలావధులకు సంబంధించి వడ్డీ రేటు 0.05 శాతం మేర తగ్గనుంది.