ఆ ఫోన్‌పై రూ. 25 వేలు తగ్గింపు | Samsung Galaxy S7 is now selling for Rs 22,990 | Sakshi
Sakshi News home page

ఆ ఫోన్‌పై రూ. 25 వేలు తగ్గింపు

Feb 9 2018 4:35 PM | Updated on Aug 1 2018 3:40 PM

Samsung Galaxy S7 is now selling for Rs 22,990 - Sakshi

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌7 (ఫైల్‌ ఫోటో)

శాంసంగ్‌ తన గెలాక్సీ ఎస్‌7 స్మార్ట్‌ఫోన్‌పై భారీగా ధర తగ్గించింది. 2016 మార్చిలో లాంచ్‌ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం రూ.25,910 తగ్గింపుకు అందిస్తోంది. అంటే లాంచింగ్‌ సందర్భంగా రూ.48,900గా ఉన్న గెలాక్సీ ఎస్‌7, ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు రూ.22,990కే అందుబాటులోకి వచ్చింది. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ జరుపుతున్న శాంసంగ్‌ కార్నివల్‌(ఉత్సవం)లో భాగంగా ఈ ఫోన్‌పై భారీ మొత్తంలో డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తోంది. రూ.25వేల కంటే తక్కువకి స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌7 బెస్ట్‌ ఫోన్‌గా కంపెనీ చెబుతోంది.  

హై-ఎండ్‌ ప్రీమియం డిజైన్‌లో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌7 ఓ అద్భుతమైన ఫోన్‌గా పేర్కొంది. హాల్‌మార్క్‌ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, ముందు, వెనుక వైపు అవుట్‌స్టాండింగ్‌ కెమెరాలు, పవర్‌ఫుల్‌ హార్డ్‌వేర్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ దీనిలో ప్రత్యేకతలుగా తెలిపింది.  గ్లాస్‌, మెటల్‌ డిజైన్‌తో ఇది రూపొందింది.  గెలాక్సీ ఎస్‌8 మాదిరి, గెలాక్సీ ఎస్‌7 స్మార్ట్‌ఫోన్‌కు కూడా డస్ట్‌, వాటర్‌ రెసిస్టాన్స్‌ కలిగి ఉంది. రూ.25వేల కంటే తక్కువ ధర కలిగిన స్మార్ట్‌ఫోన్లకు ఐపీ68- రేటింగ్‌ ఉండటం చాలా అరుదు.  

గెలాక్సీ ఎస్‌7 స్మార్ట్‌ఫోన్‌కు 5.1 అంగుళాల క్వాడ్‌-హెచ్‌డీ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 1440x2560 పిక్సెల్స్‌ రెజుల్యూషన్‌, ఎక్సీనోస్‌ 8890 ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, డ్యూయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్‌ నోగట్‌కు అప్‌గ్రేడెడ్‌, 4జీ ఎల్‌టీసీ కనెక్టివిటీ, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, 12 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా, 5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement