300 కోట్ల డాలర్ల కొనుగోలు ఒప్పందాలు | Role Reversal: India's Growth May Surpass China's by 2016 | Sakshi
Sakshi News home page

300 కోట్ల డాలర్ల కొనుగోలు ఒప్పందాలు

Sep 17 2014 12:55 AM | Updated on Aug 13 2018 3:53 PM

భారత్‌లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం చైనా కంపెనీలు 650 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నాయి.

న్యూఢిల్లీ: భారత్‌లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం చైనా కంపెనీలు 650 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. అంతేకాకుండా భారత కంపెనీలతో 300 కోట్ల డాలర్ల విలువైన కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకోనున్నాయి. నేటి నుంచి ప్రారంభం కానున్న మూడు రోజుల చైనా అధ్యక్షుడు ఝి జిన్‌పింగ్ భారత పర్యటనలో ఈ మేరకు ఒప్పందాలు జరగనున్నాయని  ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు.

 వాణిజ్యం, ఆర్థిక వృద్ధి, ఫార్మా, తదితర రంగాల్లో 16 వరకూ ఒప్పందాలు జరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఆటోమొబైల్ పారిశ్రామిక పార్క్‌ను, గుజరాత్‌లో విద్యుత్  ట్రాన్సిమిషన్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని చైనా ప్రతిపాది స్తోంది. ఈ పర్యటనలో భాగంగా సముద్ర ఆహారం, కాటన్ నూలు, పారిశ్రామిక ఉప్పు, పాలీప్రొపలీన్,  కాపర్  కాధోడ్ తదితర వస్తువుల కొనుగోళ్ల కోసం భారత కంపెనీలు 12కు పైగా చైనా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement