రెడ్‌మి కే 20 ప్రొ వచ్చేసింది | Redmi K20 Pro and Redmi K20 to launched in India  | Sakshi
Sakshi News home page

రెడ్‌మి కే 20 ప్రొ వచ్చేసింది

Jul 17 2019 12:59 PM | Updated on Jul 17 2019 2:10 PM

Redmi K20 Pro and Redmi K20 to launched in India  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి ఫ్లాగ్‌షిప్‌ కిల్లర్‌ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను లాంచ్‌ చేసింది. బుధవారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో రెడ్‌మి కే సీరిస్‌లో రెడ్‌మి 20కే, 20కే ప్రొస్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. కార్బన్‌ బ్లాక్‌, ఫ్లేమ్‌ రెడ్‌, గ్లేసియర్‌ బ్లూ కలర్స్‌లో ఆప్షన్‌లో వీటిని తీసుకొచ్చింది. హొరైజన్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌, ఫేస్‌ అన్‌లాక్‌, థియేటర్‌ గ్రేడ్‌ వ్యూయింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, ఏఐ ట్రిపుల్‌ కెమెరా,  కెమెరా ఎడ్జ్‌ లైటింగ్‌ సిస్టం పాప్‌ అప్‌కెమెరా, 20 వాట్స్‌ సోనీ చార్జ్‌ సపోర్ట్‌  ప్రత్యేకతలుగా షావోమి పేర్కొంది.   
 
రెడ్‌మి కే 20  ప్రొ ఫీచర్లు
6.39 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ హొరైజన్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌  855  ప్రాసెసర్‌
48+13+8  ఏఐ ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
20 ఎంపీ పాపప్‌ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

డ్రాప్‌ ప్రొటెక్షన్‌:  జారిపోతున్న  క్రమంలో  సీపీయూ పాప్‌అప్‌ కెమెరాను  అలర్ట్‌  చేస్తుందట. 
ధరలు

రెడ్‌మి 20 కే ప్రొ

6 జీబీర్యామ్‌, 128 స్టోరేజ్‌ 27,999  
8 జీబీర్యామ్‌, 256  స్టోరేజ్‌ 30,990

రెడ్‌ మి కే 20ఫీచర్ల విషయానికి వస్తే..
క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌ 730  ప్రాసెసర్‌  తప్ప మిగతా అన్ని ఫీచర్లను రెడ్‌మికే 20 ప్రొ ఫీచర్ల మాదిరిగానే ఉంచింది.   మిహోం, ఎంఐ, ఫ్లిప్‌కార్ట్‌  ద్వారా 22 జులై నుంచి  ఈ స్మార్ట్‌ఫోన్లు  విక్రయానికి  అందుబాటులో ఉంటాయి. 

రెడ్‌మి కే 20
6 జీబీ ర్యామ్‌, 128జీబీ  స్టోరేజ్‌ రూ. 23,999
6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ రూ. 21,999

 

Advertisement
 
Advertisement
Advertisement