మోదీ ప్రభుత్వ ప్రభ మసకబారుతోంది | Rahul Bajaj criticism | Sakshi
Sakshi News home page

మోదీ ప్రభుత్వ ప్రభ మసకబారుతోంది

Aug 8 2015 1:02 AM | Updated on Aug 15 2018 2:20 PM

మోదీ ప్రభుత్వ ప్రభ మసకబారుతోంది - Sakshi

మోదీ ప్రభుత్వ ప్రభ మసకబారుతోంది

నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రభ మసకబారుతోందని ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ తీవ్రంగా విమర్శించారు

రాహుల్ బజాజ్ తీవ్ర విమర్శలు
 
 న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రభ మసకబారుతోందని ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ తీవ్రంగా విమర్శించారు. కొత్త నలధన చట్టం ప్రజలను ఇబ్బందులకు గురిచేయడానికే పనికివస్తుందని నిప్పులు చెరిగారు. ప్రతీకారం తీర్చుకునే భావనతోనే దీనిని రూపొందించినట్లుగా ఉందని చెప్పారు.  గతంలో నరేంద్ర మోదీకి వీరాభిమాని అయిన రాహుల్ బజాజ్ ఇప్పుడు ఈ స్థాయిలో విమర్శించడం విశేషం. ప్రభుత్వం తన ప్రయత్నాలకు తానే అడ్డంకులు సృష్టించుకుంటోందని పేర్కొన్నారు.

ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త నల్లధన చట్టం ప్రకారం విదేశీ ఆస్తులున్నవాళ్లు వాటి వివరాలను వెల్లడించాల్సి ఉంటుందని, ఇలా వెల్లడి చేస్తే భవిష్యత్తులో విచారణ నుంచి విముక్తి పొందే గ్యారంటీ ఏదీ లేదని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement