‘పెంటా భారత్ ఫోన్’ ఆవిష్కరణ | 'Penta's phone' innovation | Sakshi
Sakshi News home page

‘పెంటా భారత్ ఫోన్’ ఆవిష్కరణ

Jun 7 2014 12:46 AM | Updated on Sep 2 2017 8:24 AM

‘పెంటా భారత్ ఫోన్’ ఆవిష్కరణ

‘పెంటా భారత్ ఫోన్’ ఆవిష్కరణ

దేశంలోనే తొలిసారిగా అతి తక్కువ ధరకు ఇంటర్నెట్ యాక్సెస్ రెడీ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి మారిషష్‌కు చెందిన పాంటెల్ టెక్నాలజీస్ సంస్థ ప్రవేశపెట్టింది.

బెంగళూరు: దేశంలోనే తొలిసారిగా అతి తక్కువ ధరకు ఇంటర్నెట్ యాక్సెస్ రెడీ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి మారిషష్‌కు చెందిన పాంటెల్ టెక్నాలజీస్ సంస్థ ప్రవేశపెట్టింది. మారిషస్ అధ్యక్షుడు రాజ్‌కేశ్వర్ పుర్‌యాగ్, కర్ణాటక గవర్నర్ హంసరాజ్ భరద్వాజ్, పాంటెల్ టెక్నాలజీస్ సంస్థ చైర్మన్ ప్రశాంత్ తివారీ శుక్రవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ‘పెంటా భారత్ ఫోన్’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ తివారీ మాట్లాడుతూ... మూడు అంగుళాల స్క్రీన్, డ్యూయల్ సిమ్, 1.3 మెగా పిక్సెల్ కెమెరా, దామ్‌దార్ లిథియం బ్యాటరీ గల ఈ ఫోన్ ధరను రూ.1,099గా నిర్ణయించినట్లు చెప్పారు. సర్వీస్ ప్రొవైడర్‌గా బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ పనిచేస్తుందన్నారు.

మొబైల్ బ్యాంకింగ్, టెలి మెడికల్ కేర్ డెలివరీ, ఈ-మెయిల్, ఫేస్‌బుక్ వంటి అన్ని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల సేవలతో పాటు జావా గేమ్స్, ఆటో వాయిస్‌కాల్ రికార్డింగ్ తదితర సౌకర్యాలు ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని వారికి సైతం ఈ ఫోన్‌ను చేరువ చేయడంలో భాగంగా దేశంలోని అన్ని బీఎస్‌ఎన్‌ఎల్ కేంద్రాలతో పాటు ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో అమ్మకాలు జరపనున్నట్లు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement