సరికొత్త రికార్డు స్థాయికి నిఫ్టీ | NSE Nifty to touch new peak | Sakshi
Sakshi News home page

సరికొత్త రికార్డు స్థాయికి నిఫ్టీ

Jun 6 2014 4:14 PM | Updated on Sep 2 2017 8:24 AM

సరికొత్త రికార్డు స్థాయికి నిఫ్టీ

సరికొత్త రికార్డు స్థాయికి నిఫ్టీ

స్టాక్ మార్కెట్ లో సెన్సెక్స్ జోరు కొనసాగుతోంది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ తో పోటీ పడుతూ సరికొత్త రికార్డు స్థాయిని అందుకుంది.

ముంబై: స్టాక్ మార్కెట్ లో సెన్సెక్స్ జోరు కొనసాగుతోంది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ తో పోటీ పడుతూ సరికొత్త రికార్డు స్థాయిని అందుకుంది. రెండు సూచీలు సెన్సెక్స్ ఆల్‌టైమ్ రికార్డును నమోదుచేశాయి. నిన్న సిల్వర్ జూబ్లీ చేసుకున్న సెన్సెక్స్ శుక్రవారం కూడా అదే జోష్ లో దూసుకుపోయింది. సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ మరింత పైకి ఎగిసింది.

376 పాయింట్లు పెరిగి 25,396 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా భారీగా లాభపడింది. 109 పాయింట్లు పెరిగి 7,583 వద్ద ముగిసింది. దేశీ ఆర్థిక వ్యవస్థ అంచనాలకంటే ముందే చాలావేగంగా పుంజుకోవచ్చన్న సంకేతాలు బలపడుతుండటం... యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ) మరోసారి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించొచ్చన్న అంచనాలు దేశీ మార్కెట్లలో కొత్త జోష్ నింపాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement