ఆ మొబైళ్లకు పుష్‌ నోటిఫికేషన్స్‌ బంద్‌ | Microsoft ends push notifications for Windows 7, 8 Phones | Sakshi
Sakshi News home page

ఆ మొబైళ్లకు పుష్‌ నోటిఫికేషన్స్‌ బంద్‌

Feb 20 2018 2:04 PM | Updated on Feb 20 2018 2:04 PM

Microsoft ends push notifications for Windows 7, 8 Phones  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

శాన్‌ఫ్రాన్సిస్‌కో: విండోస్‌ ఫోన్‌ 7.5, విండోస్‌ ఫోన్‌ 8.0 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో నడిచే మొబైళ్లకు పుష్‌ నోటిఫికేషన్లను నిలిపివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్‌ మంగళవారం తెలిపింది. ఈ మేరకు తన బ్లాగ్‌లో పేర్కొంది. ఒకసారి మద్ధతు నిలిపివేస్తే ఈ వర్షన్లతో నడుస్తున్న మొబైళ్లకు కంపెనీ నుంచి ఎలాంటి పుష్‌ నోటిఫికేషన్లు రావు, ‘ఫైండ్‌ మై ఫోన్‌’ ఫీచర్‌ కూడా పనిచేయదు. విండోస్‌ 8.1, విండోస్‌ 10 మొబైళ్లకు మాత్రం పుష్‌ నోటిఫికేషన్లు అందుతూనే ఉంటాయన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement