సేల్స్‌ డౌన్‌ : రెండు ప్లాంట్లను మూసివేసిన మారుతి | Maruti To Shut Down Gurugram Manesar Manufacturing Plants | Sakshi
Sakshi News home page

సేల్స్‌ డౌన్‌ : రెండు ప్లాంట్లను మూసివేసిన మారుతి

Sep 4 2019 1:48 PM | Updated on Sep 4 2019 2:44 PM

Maruti To Shut Down Gurugram Manesar Manufacturing Plants - Sakshi

వాహన విక్రయాలు పడిపోవడంతో మారుతి సుజుకి రెండు రోజుల పాటు మనేసర్‌, గురుగ్రామ్‌లోని ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించింది.

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ విక్రయాలు పడిపోవడంతో దేశంలోనే అతిపెద్ద కారు తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 7, 9 తేదీల్లో ప్రయాణీకుల వాహనాలను రూపొందించే గురుగ్రామ్‌, మనేసర్‌ ప్లాంట్లను మూసివేయాలని మారుతి సుజుకి నిర్ణయించింది. ఈ రెండు రోజుల్లో ఉత్పత్తి కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తామని కంపెనీ బుధవారం బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కు సమాచారం అందించింది. మారుతి సుజుకి నిర్ణయంతో కంపెనీ షేర్లు 2.36 శాతం మేర నష్టపోయాయి. కాగా గత ఏడాది ఆగస్ట్‌లో మొత్తం వాహన విక్రయాలు 1,68,725 కాగా ఈ ఏడాది ఆగస్ట్‌లో అమ్మకాలు 32.7 శాతం పతనమై 1,11,370 వాహనాలకే పరిమితమయ్యాయి. మరోవైపు ఆగస్ట్‌లోనూ అన్ని కంపెనీల ఆటోమొబైల్‌ విక్రయాలు తగ్గడంతో ఆర్థిక మందగమనంపై ఆందోళనలు రెట్టింపయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement