ఒడిదుడుకుల ట్రేడింగ్‌: నష్టాల్లో మార్కెట్‌

Indices open flat on mixed global markets - Sakshi

ఫార్మా, ఐటీ షేర్లు మాత్రమే లాభాల్లో

అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు

దేశీయ ఈక్విటీ మార్కెట్‌ గురువారం లాభాల్లో మొదలై నష్టాల్లోకి మళ్లింది. సెన్సెక్స్‌ 164 పాయింట్ల లాభంతో 36216 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు లాభంతో 10670 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ సంకేతాలకు తోడు మార్కెట్‌ ప్రారంభంలో అమ్మకాలు పెరగడంతో సూచీలు లాభాల ప్రారంభాన్ని నిలుపుకోలేకపోయాయి. ఫలితంగా ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 27 పాయింట్ల స్వల్ప లాభంతో 36079 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 10,607 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఐటీ, ఫార్మా షేర్లు మాత్రమే లాభాల్లో కదలాడుతున్నాయి. మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. అత్యధికంగా మెటల్‌ షేర్లు నష్టపోయాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం నష్టంతో 21, 131వద్ద ‍ట్రేడ్‌ అవుతున్నాయి. 

అంతర్జాతీయ నెలకొన్న మిశ్రమ సంకేతాలు నెలకొన్నాయి. నిన్నరాత్రి అమెరికా మార్కెట్‌ 1శాతం లాభంతో ముగిసింది. కోవిడ్‌-19 కట్టడికి ఫార్మా దిగ్గజం మోడర్నా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధిస్తున్న వార్తలతో పాటు గోల్డ్‌మెన్‌ శాక్స్‌ బ్యాంక్‌ ఫలితాలు అంచనాలకు అందుకోవడంతో అక్కడి సూచీలు లాభాల్లో ముగిశాయి. నాస్‌డాక్‌ ఇండెక్స్‌కు ఇది వరుసగా 4రోజూ లాభాల ముగింపు కావడం విశేషం. అయితే నేడు ఆసియాలో అత్యధిక మార్కెట్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. 

ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌, ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌, సైయంట్‌, ఆదిత్య బిర్లా మనీ, బజాజ్‌ కన్సూమర్‌ కేర్‌తో సహా 22 కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. వీటికి తోడు కరోనా కేసులు పెరుగుదల భయాలు, అధిక వెయిటేజీ కలిగిన రియలన్స్‌, ఇన్ఫోసిస్‌ షేర్ల ట్రేడింగ్‌ నేడు మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్నాయి.

వేదాంత, పవర్‌గ్రిడ్‌, ఐఓసీ, ఐటీసీ, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 2శాతం నుంచి 2.50శాతం లాభపడ్డాయి. విప్రో, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌టెల్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు 1శాతం నుంచి 10శాతం లాభపడ్డాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top