జీఎస్‌ఎం వినియోగదారుల జోరు | increase GSM mobile users | Sakshi
Sakshi News home page

జీఎస్‌ఎం వినియోగదారుల జోరు

Jun 18 2014 12:50 AM | Updated on Sep 2 2017 8:57 AM

జీఎస్‌ఎం వినియోగదారుల జోరు

జీఎస్‌ఎం వినియోగదారుల జోరు

జీఎస్‌ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య జోరుగానే పెరుగుతోంది. ఈ ఏడాది మేలో 61.9 లక్షల మంది కొత్తగా జీఎస్‌ఎం మొబైల్ వినియోగదారులయ్యారని సెల్యులర్ ఆపరేటర్స్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) మంగళవారం తెలిపింది.

 మేనెల నాటికి 73 కోట్లు

న్యూఢిల్లీ: జీఎస్‌ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య జోరుగానే పెరుగుతోంది. ఈ ఏడాది మేలో 61.9 లక్షల మంది కొత్తగా జీఎస్‌ఎం మొబైల్ వినియోగదారులయ్యారని సెల్యులర్ ఆపరేటర్స్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) మంగళవారం తెలిపింది. దీంతో ఏప్రిల్ చివరి నాటికి 72.68 కోట్లుగా ఉన్న మొత్తం జీఎస్‌ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య మే చివరికల్లా 73.3 కోట్లకు పెరిగిందని వివరించింది. మేలో భారతీ ఎయిర్‌టెల్‌కు అత్యధికంగా(16.5 లక్షల మంది) కొత్త వినియోగదారులు లభించారని, ఆ తర్వాతి స్థానంలో  (13 లక్షల మందితో)  యూనినార్  నిలిచిందని పేర్కొంది. భారతీ ఎయిర్‌టెల్ 28 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉందని, ఆ తర్వాతి స్థానాల్లో వొడాఫోన్(23 శాతం), ఐడియా సెల్యులర్‌లు(19 శాతం) నిలిచాయని వివరించింది.

Advertisement
 
Advertisement
Advertisement