breaking news
GSM mobile users
-
జీఎస్ఎం మొబైల్ యూజర్లు @ 69.7 కోట్లు
న్యూఢిల్లీ: జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య ఫిబ్రవరి చివరి నాటికి 69.7 కోట్లకు చేరింది. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో జీఎస్ఎం వినియోగదారుల సంఖ్య 1.4 శాతం వృద్ధితో 95.94 లక్షలు పెరిగిందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) తెలిపింది. జనవరి చివరి నాటికి జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య 68.74 కోట్లుగా ఉంది. ఈ మొత్తంలో రిలయన్స్ కమ్యునికేషన్స్, టాటా టెలిసర్వీసెస్, బీఎస్ఎన్ఎల్, క్వాడ్రాంట్ లకు చెందిన జీఎస్ఎం వినియోగదారులను చేర్చలేదని సీఓఏఐ తెలిపింది. సీఓఏఐ గణాంకాల ప్రకారం, ఎయిర్టెల్కు ఫిబ్రవరిలో కొత్తగా 30.69 లక్షల మంది వినియోగదారులు జతయ్యారు. దీంతో కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 22.31 కోట్లకు చేరింది. వోడాఫోన్ వినియోగదారుల సంఖ్య కొత్తగా 19.50 లక్షలు పెరిగింది. ఐడియా వినియోగదారుల సంఖ్య 26.98 లక్షలు పెరిగింది. ఎయిర్సెల్, యూనినార్ల వినియోగదారుల సంఖ్య వరుసగా 9.15 లక్షలు, 6.65 లక్షలు పెరిగింది. -
జీఎస్ఎం వినియోగదారుల జోరు
మేనెల నాటికి 73 కోట్లు న్యూఢిల్లీ: జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య జోరుగానే పెరుగుతోంది. ఈ ఏడాది మేలో 61.9 లక్షల మంది కొత్తగా జీఎస్ఎం మొబైల్ వినియోగదారులయ్యారని సెల్యులర్ ఆపరేటర్స్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) మంగళవారం తెలిపింది. దీంతో ఏప్రిల్ చివరి నాటికి 72.68 కోట్లుగా ఉన్న మొత్తం జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య మే చివరికల్లా 73.3 కోట్లకు పెరిగిందని వివరించింది. మేలో భారతీ ఎయిర్టెల్కు అత్యధికంగా(16.5 లక్షల మంది) కొత్త వినియోగదారులు లభించారని, ఆ తర్వాతి స్థానంలో (13 లక్షల మందితో) యూనినార్ నిలిచిందని పేర్కొంది. భారతీ ఎయిర్టెల్ 28 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉందని, ఆ తర్వాతి స్థానాల్లో వొడాఫోన్(23 శాతం), ఐడియా సెల్యులర్లు(19 శాతం) నిలిచాయని వివరించింది.