18శాతం ఢమాలన్న గృహ విక్రయాలు

Housing sales dip 18% in 9 major cities in Jul-Sept quarter: PropTiger

సాక్షి, న్యూఢిల్లీ:   జీఎస్‌టీ, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో కొత్త నిబంధనలతో రూపొందించిన చట‍్టం రెరా కారణంగా గృహాల విక్రయాలు  భారీగా పడిపోయాయని తాజా అధ్యయనాలు వెల్లడించాయి.  దేశంలో తొమ్మిది ప్రధాన నగరాల్లో ప్రాపర్టీ మార్కెట్లో   డిమాండ్‌ వరుసగా మందగిస్తోందనీ,  సెప్టెంబర్‌  క్వార్టర్‌లో ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ ఇది 18శాతం క్షీణించిందని  రిపోర్ట్‌లో  తేలింది. హైదరాబాద్‌ సహా  ఇతర ప్రధాన నగరాల్లో  ఈ ప్రభావం కనిపించింది.

రియల్టీ పోర్టల్‌  ప్రాప్‌ టైగర్‌ . కాం నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలను వెల్లడయ్యాయి.  డీమానిటైజేషన్‌,  రియల్‌ ఎస్టేట్‌ కొత్త చట్టం రెరా కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త  గృహ నిర్మాణ ప్రాజెక్టులు తగ్గుముఖం పట్టాయని తెలిపింది.   ఈ ఏడాది సెకండ్‌ క్వార్టర్‌లో దాదాపు 53 శాతం క్షీణించి, 22, 115  యూనిట్లకు పడిపోయిందని పేర్కొంది.  ముఖ‍్యంగా పుణే, నోయిడా, బెంగళూరు, చెన్నై,  హైదరాబాద్‌, కోల్‌ కత్తా, అహ్మదాబాద్‌లో గృహ అమ్మకాలు, అలాగే కొత్త ప్రాజెక్టుల లాంచింగ్‌ భారీగా పడిపోయిందని  నివేదించింది. కేవలం ముంబై, గుర్గావ్‌లో మాత్రం డిమాండ్‌ అండ్‌ సప్లయ్‌లో పురోగతి కనిపించిందని వ్యాఖ్యానించింది. 

నోట్ల రద్దు, కొత్త రెరా, జీఎస్‌టీ  కారణంగా  2018 ఆర్థిక సంవతసరంలో రెండవ త్రైమాసికంలో లాంచింగ్‌,  అలాగే అమ్మకాలు ప్రభావితం చేశాయని ప్రాప్‌ టైగర్‌ . కాం   చీఫ్ ఇన్వెస్ట్‌మెంటట్ ఆఫీసర్ అంకుర్ ధావన్ చెప్పారు. అయితే జూలై, ఆగస్టు నెలలతో పోలిస్తే, ఫెస్టివ్‌ పీజన్లో అమ్మకాలు గణనీయంగా మెరుగుపడ్డాయని పేర్కొన్నారు.

జులై-సెప్టెంబర్ క్వార్టర్లో అహ్మదాబాద్‌లో  46 శాతం భారీ క్షీణతను నమోదుచేసి  2,222 యూనిట్లు విక్రయించింది. బెంగళూరులో 27 శాతం తగ్గి, 6,976 యూనిట్లు, చెన్నై 23 శాతం నీరసపడి 2,945 యూనిట్లు, కోల్‌ కతాతా 21 శాతం  అమ్మకాలు క్షీణించి 2,993 యూనిట్లు, హైదరాబాద్ 18 శాతం తగ్గి 3,356 యూనిట్లను విక్రయాలు జరిగినట్టు తెలిపింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో అమ్మకాలు    గుర్గావ్‌ లో 60 శాతం వృద్ధితో  3,342 యూనిట్లకు చేరుకున్నాయి.  ముంబైలో 6 శాతం పెరిగి 12,101 యూనిట్లకు చేరుకున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top