హైదరాబాద్‌లో హైరింగ్ జోరు | highly hiring in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో హైరింగ్ జోరు

Apr 11 2014 1:25 AM | Updated on Sep 2 2017 5:51 AM

హైదరాబాద్‌లో హైరింగ్ జోరు

హైదరాబాద్‌లో హైరింగ్ జోరు

హైరింగ్ కార్యకలాపాలు గత నెలలో 3 శాతం వృద్ధి చెందాయని టైమ్స్‌జాబ్స్‌డాట్‌కామ్ రిక్రూటెక్స్ నివేదిక వెల్లడించింది.

 న్యూఢిల్లీ: హైరింగ్ కార్యకలాపాలు గత నెలలో 3 శాతం వృద్ధి చెందాయని టైమ్స్‌జాబ్స్‌డాట్‌కామ్  రిక్రూటెక్స్ నివేదిక వెల్లడించింది. మార్చిలో అగ్రశ్రేణి ఉద్యోగ కేంద్రంగా హైదరాబాద్ నిలిచిందంటున్న  ఈ నివేదిక పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు....,  

 హైదరాబాద్‌లో ప్రతిభ గల ఉద్యోగులకు డిమాండ్ 30 శాతం పెరిగింది. ఈ డిమాండ్ చెన్నైలో 20 శాతం ఉండగా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 6 శాతంగా ఉంది.

 జనవరి, ఫిబ్రవరిలలో ఉద్యోగ నియామక కార్యకలాపాల్లో చెప్పుకోదగ్గ వృద్ధి లేదు. ఫిబ్రవరిలో 90 పాయింట్లుగా ఉన్న రిక్రూటెక్స్ డిమాండ్ ఇండెక్స్ మార్చిలో 93 పాయింట్లకు పెరిగింది.

రాజకీయ అనిశ్చితికి ఎన్నికల ద్వారా తెరపడనున్నందున మార్చిలో హైరింగ్ కార్యకలాపాలు పెరిగాయి. భవిష్యత్ పట్ల భారత కంపెనీలు ఆశావహంగా ఉన్నాయనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.

 మార్చిలో ప్రాజెక్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అధికంగా ఉద్యోగాలొచ్చాయి. ఈ రంగంలో హైరింగ్ వృద్ధి 12 శాతంగా ఉంది. ఇక అత్యధిక ఉద్యోగాలు కల్పించిన రెండో రంగమైన పెట్రో కెమికల్స్ పరిశ్రమలో 9 శాతం వృద్ధి నమోదైంది. ఆర్థిక వ్యవస్థలో రికవరీ సంకేతాలను  మొదటిసారిగా ఈ రెండు రంగాలు సూచిస్తున్నాయి. ఈ రెండు రంగాలకు సంబంధించి జనవరిలో  సెంటిమెంట్ ప్రతికూలంగా ఉండగా, ఫిబ్రవరిలో కాస్త పుంజుకుంది.

 నిర్మాణ, సిమెంట్, లోహ, స్టీల్, ఉక్కు పరిశ్రమల్లో హైరింగ్ వృద్ధి 9 శాతంగా ఉంది.

ఐటీ, టెలికం రంగాల్లో హైరింగ్ 6 శాతం పెరగ్గా, ఆరోగ్య సంరక్షణ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, తయారీ, ఇంజనీరింగ్ పరిశ్రమల్లో 5 శాతం వృద్ధి నమోదైంది.

 భారత కంపెనీల నుంచి ఇంజనీరింగ్ పట్టభద్రులకు డిమాండ్ భారీగా ఉంది. రానున్న కాలంలో ఇది మరింతగా పెరగనున్నది. మార్చిలో రెండంకెల వృద్ధి సాధించిన ఏకైక రంగం ఇదే.

 20 ఏళ్ల అనుభవమున్న వృత్తి నిపుణులకు డిమాండ్ 30 శాతం పెరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement