ముంబై ఎయిర్‌పోర్టులో వాటా పెంచుకున్న జీవీకే  | GVK is the shareholder in Mumbai airport | Sakshi
Sakshi News home page

ముంబై ఎయిర్‌పోర్టులో వాటా పెంచుకున్న జీవీకే 

Mar 23 2019 12:10 AM | Updated on Mar 23 2019 12:10 AM

GVK is the shareholder in Mumbai airport - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో (ఎంఐఏఎల్‌) జీవీకే గ్రూప్‌ తన వాటాను పెంచుకుంది. ఎంఐఏఎల్‌లో తమ అనుబంధ కంపెనీ జీవీకే ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ 10 శాతం వాటాకు సమానమైన 12 కోట్ల షేర్లను రూ.924 కోట్లు వెచ్చించి ఏసీఎస్‌ఏ గ్లోబల్‌ నుంచి దక్కించుకున్నట్టు జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ శుక్రవారం తెలిపింది. ఇటీవల బిడ్‌వెస్ట్‌ నుంచి కొనుగోలు చేసిన 13.5 శాతం వాటాతో కలిపి ఎంఐఏఎల్‌లో జీవీకే గ్రూప్‌ వాటా తాజా డీల్‌తో 50.5 శాతం నుంచి 74 శాతానికి ఎగసింది. 

Advertisement
 
Advertisement
Advertisement