జీడీపీ

GDP growth at 3.1 per cent in Q4 drags full year FY20 growth to 4.2 per cent - Sakshi

2019– 20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 4.2 శాతం

చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు 3.1 శాతమే

పదకొండేళ్ల కనిష్ట స్థాయిలు ఇవి...

తయారీ, నిర్మాణ రంగాలు మైనస్‌; వ్యవసాయం ఓకే

న్యూఢిల్లీ: అందరి అంచనాలకు అనుగుణంగానే భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 2019 ఏప్రిల్‌ –2020 మార్చి ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా నెమ్మదించింది. ఈ కాలంలో కేవలం 4.2 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి ఏడు రోజులూ (2020 మార్చి చివరి వారం) కరోనా భయాలతో దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. ఈ కాలంలో (మార్చి 25 నుంచి 31వ తేదీ వరకూ) ఆర్థిక వ్యవస్థకు రూ.1.4 లక్షల కోట్ల నష్టం జరిగిందన్నది ఒక అంచనా. ఇక ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి–మార్చి)లో వృద్ధి రేటు కేవలం 3.1 శాతం. భారత్‌ జీడీపీ 2019–2020 మూడవ త్రైమాసికంలో (అక్టోబర్‌–డిసెంబర్‌) ఏడేళ్ల కనిష్టం 4.1 శాతానికి (4.7 శాతం నుంచి దిగువవైపు సవరణ) పడిపోయింది. తాజాగా మరింత కిందకు జారింది.  మొదటి త్రైమాసికం, రెండవ త్రైమాసికాల్లో వరుసగా 5.2 శాతం, 4.4 శాతం వృద్ధి రేట్లు  (5.6 శాతం, 5.1 శాతం నుంచి తగ్గింపు) నమోదయ్యాయి. 2018–19లో దేశ జీడీపీ వృద్ధిరేటు 6.1 శాతం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను క్లుప్తంగా విశ్లేషిస్తే...

► 2008–09లో కేవలం 3.1 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. అటు తర్వాత ఆర్థిక వృద్ధి ఇంత తక్కువ స్థాయి (4.2 శాతం) ఇదే తొలిసారి. ఆర్‌బీఐ 5 శాతం అంచనాకన్నా తక్కువకు ఇది పడిపోవడం గమనార్హం.  

► నాల్గవ త్రైమాసికంలో వచ్చిన 3.1 శాతం గడచిన 44 త్రైమాసికాల్లో ఎన్నడూ రాలేదు. అంటే ఈ స్థాయి వృద్ధిరేటు 11 సంవత్సరాల కనిష్టమన్నమాట. 2018–19 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు 5.7 శాతం. ఇక భారత్‌ పోల్చుకునే చైనా ఆర్థిక వ్యవస్థ జనవరి–మార్చి 2020 త్రైమాసికంలో –6.8 శాతం క్షీణతలో ఉంది. కోవిడ్‌–19 దీనికి నేపథ్యం.

► నిపుణుల అంచనాల ప్రకారం కరోనా నేపథ్యంలో భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) 41 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మాంద్యం పరిస్థితిలోకి జారి‡పోనుంది.   1958, 1966, 1980 ఆర్థిక సంవత్సరాల్లో మూడుసార్లు దేశం మాంద్యాన్ని ఎదుర్కొంది. ఈ మూడు సందర్భాల్లోనూ వర్షపాతం సరిగా లేక, అప్పట్లో ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయం దెబ్బతినడమే కారణం. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థలో అసలు వృద్ధిలేకపోగా, మైనస్‌ (క్షీణత) గనుక నమోదయితే దానిని మాంద్యంగా పరిగణిస్తారు.  

క్యూ4లో రంగాల వారీ ‘జీవీఏ’ వృద్ధి...
జనవరి–మార్చి మధ్య కాలంలో గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌ (జీవీఏ) ఆధారిత వృద్ధి రేటు కేవలం 3 శాతంగా ఉండడం గమనించదగిన మరో అంశం. అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్య ఈ రేటు 3.5 శాతం ఉంటే, 2018–19లో నాల్గవ త్రైమాసికంలో ఈ విభాగంలో వృద్ధి రేటు 5.6 శాతంగా ఉంది. 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాల 4వ త్రైమాసికాలను చూస్తే... తయారీ రంగం జీవీఏ 2.1 శాతం వృద్ధి నుంచి – 1.4 శాతం క్షీణతలోకి పడిపోయింది. కాగా మొత్తం ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 5.7 శాతం నుంచి 0.03 శాతానికి తగ్గింది.   నిర్మాణ రంగం జీవీఏ 6 శాతం వృద్ధి నుంచి –2.2 శాతం క్షీణతలోకి జారింది.

అయితే జీడీపీలో 14 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగంలో వృద్ధి మాత్రం 1.6 శాతం నుంచి 5.9 శాతానికి పెరిగింది.  ఈ రంగంలో ప్రభుత్వ వ్యయాలు దీనికి ఒక కారణం. మైనింగ్‌ రంగం కూడా –4.8 శాతం క్షీణత నుంచి 5.2 శాతం వృద్ధికి మారింది. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవల విభాగంలో వృద్ధిరేటు 5.5 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గింది. ట్రేడ్, హోటల్, రవాణా, కమ్యూనికేషన్లు అలాగే బ్రాడ్‌కాస్టింగ్‌ సేవల్లో 6.9 శాతం వృద్ధిరేటు 2.6 శాతానికి పడిపోయింది.  ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్‌ సర్వీసుల వృద్ధి రేటు 8.7 శాతం నుంచి 2.4 శాతానికి దిగింది. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, రక్షణ ఇతర సేవల వృద్ధిరేటు కూడా 11.6% నుంచి 10.1 శాతానికి తగ్గింది.

విలువలు ఇలా...
2011–12 ధరల స్థితి ప్రకారం... ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటూ (రియల్‌ జీడీపీ) వేసిన లెక్కల ప్రకారం... 2018–19 ఆర్థిక సంవత్సరం క్యూ4 జీడీపీ విలువ రూ.36.90 లక్షల కోట్లు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ రూ.38.04 లక్షల కోట్లకు పెరిగింది. అంటే క్యూ4లో జీడీపీ వృద్ధిరేటు 3.1 శాతంమన్నమాట. ఇక ఇదే విధంగా 2018–19 ఆర్థిక సంవత్సరం జీడీపీ విలువ రూ.139.81 లక్షల కోట్లయితే, ఈ విలువ 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.145.66 లక్షల కోట్లకు చేరింది. అంటే ఇక్కడ వృద్ధిరేటు 4.2 శాతం అని అర్థం.

తలసరి ఆదాయంలో 6.1 శాతం వృద్ధి
జీడీపీ లెక్కప్రకారం, తలసరి ఆదాయం 2018–19లో రూ.1,26,521 అయితే, ఇది 2019–20లో రూ.1,34,226కు చేరింది. వృద్ధి 6.1 శాతం.  

కట్టు తప్పిన ద్రవ్యలోటు...
తాజా జీడీపీ గణాంకాల నేపథ్యంలో మొత్తం జీడీపీలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయ, వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) 4.6 శాతంగా నమోదయ్యింది. నిజానికి ఆర్థిక సంవత్సరం మొత్తం జీడీపీలో ద్రవ్యలోటు 3.8 శాతం దాటకూడదని సవరిత అంచనాలు నిర్దేశిస్తున్నాయి. సవరించకముందు ఇది ఇంకా తక్కువగా 3.3 శాతంగానే ఉంది. రెవెన్యూ అంచనాల మేర లేకపోవడం మొత్తం ద్రవ్యలోటుపై చివరకు తీవ్ర ప్రభావమే చూపిందని చెప్పవచ్చు. రెవెన్యూలోటు కేవలం 2.4 శాతమే (జీడీపీ విలువలో) ఉండాలని భావిస్తే, ఇది తాజా లెక్కల ప్రకారం 3.27 శాతానికి చేరింది.

జీడీపీ... జీవీఏ అంటే...
గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌ (జీవీఏ): ఉత్పత్తిదారులు లేదా సరఫరాల వైపు నుంచి ఒక ఆర్థిక సంవత్సరం, లేదా త్రైమాసికంలో ఆర్థిక క్రియాశీలత ఎలా ఉందన్న అంశాన్ని తెలియజేస్తుంది. ప్రత్యేకించి పరిశ్రమ లేదా ఆర్థిక వ్యవస్థలో ఒక రంగం వృద్ధి తీరు ఎలా ఉందన్న విషయాన్ని నిర్దిష్టంగా పరిశీలించడానికి ఈ విధానం దోహదపడుతుంది.   

స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ): వినియోగదారులు లేదా డిమాండ్‌ వైపు నుంచి ఆర్థిక వ్యవస్థ పనితీరును చూపిస్తుంది.  దేశంలో వార్షికంగా లేదా త్రైమాసిక పరంగా జరిగే (పూర్తి స్థాయిలో) మొత్తం వస్తువులు, సేవల ఉత్పత్తి విలువ ఇది. జీడీపీని ఫ్యాకర్‌ కాస్ట్‌లో అలాగే మార్కెట్‌ ప్రైస్‌లో చూస్తారు. జీడీపీ ఫ్యాక్టర్‌ కాస్ట్‌ అంటే  జీవీఏ ఫ్యాక్టర్‌ కాస్ట్‌ అన్నమాటే. మార్కెట్‌ ప్రైస్‌ అంటే ఇక్కడ ప్రభుత్వ పన్నులు, సబ్సిడీలు కూడా గమనంలోకి వస్తాయి. జీడీపీలో కూడా నామినల్‌ – రియల్‌ అని 2 రకాలు. ద్రవ్యోల్బణం లెక్కలతో పనిలేకుండా, ప్రస్తుత ధరలను పరిగణనలోకి తీసుకుని లెక్కిం చే ది నామినల్‌ జీడీపీ. అయితే, ఒక బేస్‌ సంవత్సరం గా ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని లెక్కించేదే రియల్‌ జీడీపీ. మనం అనుసరించేది దీన్నే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

29-11-2020
Nov 29, 2020, 09:46 IST
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో 75 మందికి కరోనా పాజిటివ్‌ రావడం...
29-11-2020
Nov 29, 2020, 04:37 IST
సాక్షి, హైదరాబాద్, మేడ్చల్‌: దేశంలో కరోనా టీకా అభివృద్ధి కోసం మూడు ఫార్మా దిగ్గజ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలను ప్రత్యక్షంగా...
28-11-2020
Nov 28, 2020, 20:28 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రపదేశ్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 49,348 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 625...
28-11-2020
Nov 28, 2020, 20:25 IST
సాక్షి, అమరావతి: ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ అని సామెత. ప్రపంచం మొత్తమ్మీద ఉన్న గణిత శాస్త్రవేత్తలకు ఇప్పుడీ సామెత...
28-11-2020
Nov 28, 2020, 18:55 IST
కంపెనీలు ప్రకటిస్తున్న ఏ కరోనా వ్యాక్సిన్లను తీసుకోమంటూ కొంత మంది దేశాధినేతలే ప్రకటించడం ఆశ్చర్యకరంగా ఉంది.
28-11-2020
Nov 28, 2020, 17:03 IST
వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ని కట్టడి చేయగల వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తీవ్రంగా కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే....
28-11-2020
Nov 28, 2020, 16:42 IST
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్ అందుబాటులో వచ్చిన నాలుగు వారాల్లోనే ఢిల్లీ వాసులందరికి అందజేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్...
28-11-2020
Nov 28, 2020, 16:06 IST
భోపాల్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైన నాటి నుంచి ప్రజల్లో ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత మీద విపరీతమైన శ్రద్ధ పెరిగింది....
28-11-2020
Nov 28, 2020, 15:38 IST
వ్యాక్సిన్ల పనితీరును అంచనా వేయడానికి ఓ చిత్రమైన మేథమెటికల్‌ ఫార్ములాను అమలు చేస్తున్నారు.
28-11-2020
Nov 28, 2020, 15:30 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  భారత్‌ బయోటెక్‌ పర్యటన ముగిసింది. మూడు నగరాల పర్యటనలో భాగంగా శనివారం హైదరాబాద్‌కు వచ్చని...
28-11-2020
Nov 28, 2020, 15:28 IST
సిమ్లా: కరోనా వ్యాప్తి కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన నియమాలు తెచ్చినా.. కొందరు జనాలు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోరు....
28-11-2020
Nov 28, 2020, 11:13 IST
మహారాష్ట్ర: కరోనా బారిన పడి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భారత్‌ భాల్కే మరణించారు. పుణేలోని రబీ ఆస్పత్రిలో శుక్రవారం నుంచి...
28-11-2020
Nov 28, 2020, 08:23 IST
బీజింగ్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ గురించి మరో కొత్త విషయం బయటపడింది. శరీరం మొత్తం వ్యాపించేందుకు కరోనా వైరస్‌ మన...
28-11-2020
Nov 28, 2020, 04:53 IST
సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) కరోనా వ్యాధి నిర్ధారణకు అభివృద్ధి...
28-11-2020
Nov 28, 2020, 04:26 IST
న్యూఢిల్లీ: కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆంక్షల్ని కఠినంగా అమలు చేయాలని సుప్రీం కోర్టు శుక్రవారం కేంద్రానికి ఆదేశాలు...
28-11-2020
Nov 28, 2020, 03:27 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. ముందు చూపుతో వ్యవహరించి వైరస్‌...
27-11-2020
Nov 27, 2020, 17:34 IST
న్యూఢిల్లీ: భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య వ్యాక్సిన్‌ డీల్‌ కుదిరింది. పొరుగు దేశానికి మూడు కోట్ల వ్యాక్సిన్‌ డోసులు సరఫరా చేసేందుకు...
27-11-2020
Nov 27, 2020, 13:50 IST
మాస్కో/ హైదరాబాద్‌: దేశీయంగా రష్యన్‌ వ్యాక్సిన్‌ తయారీకి హైదరాబాద్‌ ఫార్మా కంపెనీ హెటెరో డ్రగ్స్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రష్యన్‌ డైరెక్ట్‌...
27-11-2020
Nov 27, 2020, 11:47 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారత్‌లో నమోదైన మొత్తం కరోనా కేసులు 93లక్షలు దాటేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 43,082 కోవిడ్‌...
27-11-2020
Nov 27, 2020, 10:44 IST
న్యూఢిల్లీ, సాక్షి: కరోనా వైరస్‌ కట్టడికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ తాను తీసుకోబోనని బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో తాజాగా స్పష్టం...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top