చందా కొచర్‌పై సీబీఐ లుక్‌ అవుట్‌ నోటీసు | CBI issues lookout circular against Chanda Kochhar  | Sakshi
Sakshi News home page

చందా కొచర్‌పై లుక్‌ అవుట్‌ నోటీసు

Feb 22 2019 9:42 AM | Updated on Feb 22 2019 1:03 PM

CBI issues lookout circular against Chanda Kochhar  - Sakshi

సాక్షి, ముంబై: అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ మాజీ సీంఎడీ చందా కొచర్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఐసీఐసీఐ- వీడియోకాన్‌ రుణ వివాదంలో  చందా కొచర్‌పై  సీబీఐ లుక్‌ అవుట్‌ నోటీసు(ఎల్‌వోసీ) జారీ చేసింది. ఎకానమిక్స్‌ టైమ్స్‌ కథనం ప్రకారం చందా కొచర్‌తోపాటు ఆమె భర్తదీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌లపై కూడా  సీబీఊ అధికారులు ఎల్‌వోసీ నోటీసులు జారీ చేశారు. దేశం విడిచి పారిపోనున్నా రనేఅంచనాల నేపథ్యంలో సీబీఐ ఈ చర్య చేపట్టింది. ఈ మేరకు సీబీఐ ఇమిగ్రేషన్ అధికారులను అప్రమత్తం చేసింది.  అన్ని విమానాశ్రయాలకు  ఆదేశాలు జారీ చేసింది. తమ అనుమతి లేకుండా వీరు విమానాశ్రయాలను దాటిపోరాదని స్పష్టం చేసింది. 

కాగా 2012లో వీడియోకాన్‌ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్‌ ఇచ్చిన రూ. 3,250 కోట్ల రుణాల వివాదంపై విచారణ జరిపిన జస్టిస్‌ బి.ఎన్‌.శ్రీకృష్ణ కమిటీ బ్యాంక్‌ మాజీ సీఈవో చందా కొచర్‌ని దోషిగా తేల్చింది. బ్యాంకు నిబంధనలను ఆమె ఉల్లంఘించారని స్పష్టం చేసింది.  దీన్ని అప్పటివరకూ ఆమెను సమర్ధిస్తూ వచ్చిన ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు కూడా పూర్తిగా ఆమోదించింది. అంతేకాదు చందా కొచర్‌ ఇప్పటికే రాజీనామా చేసినప్పటికీ,  నివేదిక నేపథ్యంలో ఆమెను విధుల నుంచి తొలగించినట్లుగా పరిగణిస్తామని పేర్కొంది.  అలాగే ఇంక్రిమెంట్లు, బోనస్‌లు, వైద్య చికిత్స పరమైన ప్రయోజనాలు, స్టాక్‌ ఆప్షన్స్‌ మొదలైనవి రద్దవుతాయని ప్రకటించింది. మరోవైపు ఈ కుంభకోణంలో సీబీఐ ఇప్పటికే చందా కొచర్, దీపక్‌ కొచర్, వీడియోకాన్‌ గ్రూప్‌ఎండీ వేణుగోపాల్‌ ధూత్‌ తదితరులపై క్రిమినల్‌ కుట్ర, మోసం అభియోగాలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement