బ్యూటీ వ్యాపారంలోకి అరవింద్ | Arvind into the beauty business | Sakshi
Sakshi News home page

బ్యూటీ వ్యాపారంలోకి అరవింద్

Sep 12 2015 1:12 AM | Updated on Aug 11 2018 7:29 PM

బ్యూటీ వ్యాపారంలోకి అరవింద్ - Sakshi

బ్యూటీ వ్యాపారంలోకి అరవింద్

ప్రముఖ టెక్స్‌టైల్స్ కంపెనీ అరవింద్ బ్యూటీ, పర్సనల్ కేర్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది...

ముంబై: ప్రముఖ టెక్స్‌టైల్స్ కంపెనీ అరవింద్ బ్యూటీ, పర్సనల్ కేర్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. దీని కోసం ఫ్రాన్స్‌కు చెందిన బ్యూటీ రిటైల ర్ సెఫోరాతో జతకట్టింది. ఇకపై భారత్‌లో సెఫోరా కార్యకలాపాలను అరవింద్ నిర్వహిస్తుంది.  బ్యూటీ, పర్సనల్ కేర్ మార్కెట్ రూ.15,000 కోట్లుగా ఉందని, అందులో ప్రీమియం మార్కెట్ విలువ రూ.2,500 కోట్లుగా ఉందని అరవింద్ లైఫ్‌స్టైల్ బ్రాండ్స్ మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ జె.సురేశ్ తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో సెఫోరా టర్నోవర్ రూ.500 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. ఇదే సమయంలో 15 పట్టణాల్లో 40-45 వరకు కొత్త సెఫోరా స్టోర్లను ప్రారంభిస్తామని తెలిపారు. కాగా ప్రస్తుతం డీఎల్ ఎఫ్ ఆధ్వర్యంలో ఉన్న నాలుగు సెఫోరా స్టోర్ల నిర్వహణను ఇకపై అరవింద్ చూసుకోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement