 
													యూఎస్ కాకుండా ఇతర మార్కెట్లకు అధికం
ఆసియా, యూరప్ దేశాల నుంచి డిమాండ్
న్యూఢిల్లీ: టెక్స్‌టైల్స్, రత్నాభరణాలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు అమెరికా కాకుండా ఇతర మార్కెట్లకు మెరుగుపడినట్టు వాణిజ్య శాఖ డేటా తెలియజేస్తోంది. యూఏఈ, వియత్నాం, బెల్జియం, సౌదీ అరేబియాకు ఈ రంగాల నుంచి ఎగుమతులు పెరిగాయి. ఆసియా, యూరప్, పశి్చమాసియా దేశాల్లో డిమాండ్ భారత ఎగుమతులకు కలిసొస్తోంది.
ఈ ఏడాది జనవరి నుంచి సెపె్టంబర్ మధ్య సముద్ర ఉత్పత్తుల (రొయ్యలు, చేపలు తదితర) ఎగుమతులు 15.6 శాతం పెరిగి 4.83 బిలియన్ డాలర్లకు చేరాయి. 1.44 బిలియన్ డాలర్లతో అమెరికా భారత సముద్ర ఉత్పత్తులకు ఈ కాలంలో అతిపెద్ద కేంద్రంగా ఉంది. ఈ కాలంలో వియత్నాంకు 100 శాతం, బెల్జియంకు 73 శాతం, థాయిలాండ్‌కు 54 శాతం చొప్పున క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఎగుమతులు పెరిగాయి.
చైనాకు 10 శాతం, మలేసియాకు 64 శాతం, జపాన్‌కు 11 శాతం వరకు ఎగుమతులు అధికంగా నమోదయ్యాయి. ఇలా ఇతర దేశాలకు ఎగుమతులు పెరగడం వల్ల అమెరికా తదిర కొన్ని దేశాలపై ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం తప్పుతుందని వాణిజ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఆగస్ట్ నుంచి భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్‌లు అమలు చేస్తుండడం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఇతర దేశాలకు ఎగుమతులు విస్తృతం కావడం వల్ల టారిఫ్‌ల ప్రభావాన్ని అధిగమించే వెసులుబాటు లభిస్తుంది.   
టెక్స్‌టైల్స్ ఎగుమతుల్లో స్వల్ప వృద్ధి 
ఈ ఏడాది జనవరి నుంచి సెపె్టంబర్ కాలంలో టెక్స్‌టైల్స్ ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 1.23 శాతం పెరిగి 28 బిలియన్ డాలర్లకు చేరాయి. యూఏఈకి ఎగుమతులు అత్యధికంగా 8.6 శాతం పెరిగి 136.5 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. నెదర్లాండ్స్‌కు 12 శాతం, పోలండ్‌కు 24 శాతం, స్పెయిన్‌కు 9 శాతం, ఈజిప్‌్టకు 25 శాతం చొప్పున టెక్స్‌టైల్స్ ఎగుమతులు అధికంగా నమోదయ్యాయి. ఇక రత్నాభరణాల ఎగుమతులు సైతం 1.24 శాతం పెరిగి 22.73 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. యూఈకి 38 శాతం అధికంగా 1.93 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. దక్షిణ కొరియాకు 134 శాతం, సౌదీ అరేబియాకు 68 శాతం, కెనడాకు 41 శాతం చొప్పున రత్నాభరణాల ఎగుమతులు పెరిగినట్టు వాణిజ్య శాఖ డేటా తెలియజేస్తోంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
