ముచ్చట తీర్చుకున్న ఆనంద్‌ మహీంద్ర

Anand Mahindra Acquires Rajinikanth Kaala Car For His Museum  - Sakshi

సాక్షి, చెన్నై: మహీంద్ర గ్రూప్‌ అధినేత ఆనంద్‌ మహీంద్ర తన ముచ్చట కాస్తా తీర్చుకున్నారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 'కాలా' సినిమాలో మహీంద్ర థార్‌ వాహనాన్ని సొంతం చేసుకున్నారు. కాలా వాహనాన్ని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతామని గతంలోనే ప్రకటించిన ఆయన ఇపుడు ఈ కోరికను నెరవేర్చుకున్నారు. ఈ మేరకు ఆయన గురువారం ట్విటర్‌లో ట్వీట్‌ ​ చేశారు. అనుకున్నట్టుగానే మహీం​ద్ర థార్‌ వాహనం చెన్నైలోని మహీం​ద్ర రీసెర్చ్‌ వ్యాలీలో సురక్షితంగా ఉందంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాలా సినిమాలోని పోస్టర్‌ షాట్‌లోవాడిన  కారును మ్యూజియంలో పెట్టుకోవడానికి నిర్మాత ధనుష్‌ అంగీకరించారని తెలిపారు. అంతేకాదు దీనితోపాటు ఒక ఆసక్తికరమైన వీడియోను కూడా షేర్‌ చేశారు. ఈ వీడియోలో  మహీంద్ర  ఉద్యోగులు కాలా అవతార్‌లో సందడి చేశారు. 

గతంలో కాలా  పోస్టర్ చూసిన ఆనంద్ మహీంద్రా  ఆ కారుపై మనసు పడ్డారు. ఆ వాహనాన్ని తన కంపెనీ మ్యూజియంలో పెట్టుకుంటామని, సూపర్‌స్టార్‌ రజనీలాంటి ఓ లెజెండ్‌ కారుని  ఓ సింహాసనంలా వాడుకున్నారు.. దీంతో ఆ కారుకూడా  లెజెండ్‌ అయిపోతుందని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.  దీనికి రజనీకాంత్ అల్లుడు,  హీరో ధనుష్  సానుకూలంగా  స్పందించిన సంగతి విదితమే.

కాగా రజనీకాంత్‌ హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న 'కాలా' సినిమా అనేక వివాదాల నడుమ గురువారం థియేటర్లను పలకరించింది. ఇందులో తలైవా గ్యాంగ్‌లీడర్‌గా నటించగా, ఈశ్వరీ రావు , హ్యూమా ఖురేషి, నానా పటేకర్‌ ఇతర ప్రముఖ  పాత్రలు పోషించారు.  ధనుష్‌ నిర్మాణ సారధ్యం వహించగా, పా రంజిత్‌ దర్శకుడు.  సంతోష్‌ నారాయణన్‌ బాణీలు అందించారు. అయితే కాలా సినిమాకు మిశ్రమ స్పందన కనిపిస్తోంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top