రూ.3799 కే నోకియా స్మార్ట్‌ఫోన్‌ | Airtel Offers Nokia Phones At Down Payments From Rs 3799 | Sakshi
Sakshi News home page

రూ.3799 కే నోకియా స్మార్ట్‌ఫోన్‌

May 25 2018 7:32 PM | Updated on May 25 2018 8:35 PM

Airtel Offers Nokia Phones At Down Payments From Rs 3799 - Sakshi

నోకియా 8 సిరొక్కో, నోకియా 7 ప్లస్‌, నోకియా 6.1

న్యూఢిల్లీ : నోకియా ఫ్యాన్స్‌కు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. నోకియా కొత్త స్మార్ట్‌ఫోన్లు నోకియా 8 సిరొక్కో, నోకియా 7 ప్లస్‌, నోకియా 6(2018) ఫోన్లను  తన ఆన్‌లైన్‌ స్టోర్‌లో అందుబాటులో ఉంచామని, ఈ ఫోన్లపై డౌన్‌పేమెంట్‌ రూ.3799 నుంచి ప్రారంభమవుతుందని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. తక్షణ ఫైనాన్సింగ్‌ ఆమోదంతో ఎయిర్‌టెల్‌ ఈ-స్టోర్‌ నుంచి ఈ ఫోన్లను కొనుగోలు చేసుకోవచ్చని, వీటిపై ఈఎంఐ రూ.1499 నుంచి ప్రారంభమవుతుందని ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. 

తమ డిజిటల్‌ ప్లాట్ఫామ్‌పై నోకియా స్మార్ట్‌ఫోన్‌ రేంజ్‌లను ప్రవేశపెడుతున్నామని భారతీ ఎయిర్‌టెల్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ వాణి వెంకటేష్‌ తెలిపారు. అదనంగా పోస్టు పెయిడ్‌ ప్లాన్లతో కలిపి ఈఎంఐలను ఆఫర్‌ చేస్తున్నామని పేర్కొన్నారు. 2017 అక్టోబర్‌ నుంచి ఎయిర్‌టెల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ స్మార్ట్‌ఫోన్లను ఆఫర్‌ చేయడం ప్రారంభించింది. ఈ స్టోర్‌లో ఆపిల్‌, శాంసంగ్‌, ఇతర ఫోన్లు సరసమైన డౌన్‌పేమెంట్లలోనే అందుబాటులోకి తీసుకొస్తోంది. ‘ప్రాజెక్ట్‌ నెక్ట్స్‌’  అనే డిజిటల్‌ ఇన్నోవేషన్‌ ప్రొగ్రామ్‌లో ఇది భాగం.

డివైజ్‌                       డౌన్‌పేమెంట్‌                       ఈఎంఐ
నోకియా 6.1             రూ.3799                   రూ.1499తో 12 ఈఎంఐలు
(3జీబీ ర్యామ్‌)

నోకియా 6.1             రూ.5799                    రూ.1499తో 12 ఈఎంఐలు
(4జీబీ ర్యామ్‌)

నోకియా 7 ప్లస్‌          రూ.5599                    రూ.2099తో 12 ఈఎంఐలు

నోకియా సిరొక్కో          రూ.8599                   రూ.2799తో 18 ఈఎంఐలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement