గ్రహం అనుగ్రహం (25-06-2020)

Daily Rashi phalalu in Telugu (25-06-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి శు.చవితి ఉ.8.46 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం ఆశ్లేష ప.12.57 వరకు, తదుపరి మఖ వర్జ్యం రా.12.27 నుంచి 1.56 వరకు, దుర్ముహూర్తం ఉ.9.54 నుంచి 10.44 వరకు, తదుపరి ప.3.04 నుంచి 3.56 వరకు అమృతఘడియలు... ఉ.11.22 నుంచి 12.44 వరకు.

సూర్యోదయం :    5.31
సూర్యాస్తమయం    :  6.34
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

గ్రహఫలం
మేషం: ప్రయాణాలు రద్దు. అనుకోని ఖర్చులు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా కొనసాగుతాయి.

వృషభం: పర పతి పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ధనప్రాప్తి. మిత్రుల చేయూత. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు.

మిథునం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటకం: శుభకార్యాల ప్రస్తావన. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

సింహం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో విభేదాలు. స్వల్ప అనారోగ్యం. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కన్య: బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

తుల: పొరపాట్లు సరిదిద్దుకుని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత. ఇంటాబయటా ఒత్తిడులు తొలగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.\

వృశ్చికం: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు తప్పవు. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

ధనుస్సు: సన్నిహితులతో వివాదాలు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మకరం: పనుల్లో విజయం. బంధువర్గం నుంచి శుభవార్తలు. వాహనయోగం. కుటుంబంలో అనుకూలత. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

కుంభం: కొత్త వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

మీనం: పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చిక్కులు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top