‘గాలేరు-నగరి’ సాధనకు రోజా పాదయాత్ర | YSRCP MLA Roja Starts Padayatra For Galeru-Nagari | Sakshi
Sakshi News home page

‘గాలేరు-నగరి’ సాధనకు రోజా పాదయాత్ర

Nov 28 2017 11:32 AM | Updated on May 29 2018 4:37 PM

YSRCP MLA Roja Starts Padayatra For Galeru-Nagari - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, తిరుమల : గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు సాధన కోసం నగరి ఎమ్మెల్యే ఆర్‌.కె.రోజా మంగళవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె సోమవారం తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాలు తాగునీరు, సాగునీటి కోసం గాలేరు-నగరి ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు.

ప్రాజెక్టు కోసం చేపడుతున్న పాదయాత్ర నగరిలోని సత్రవాడ నుంచి ప్రారంభమై తిరుమల వరకు సాగుతుందని వెల్లడించారు. డిసెంబరు 2వ తేదీ శ్రీవారిని దర్శించుకుని ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యేలా చూడాలని ప్రార్థిస్తామన్నారు. ఈ యాత్ర ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. పాదయాత్రలో పార్టీ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement