వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం | ysrcp mla, mlcs donate one month salary for hudhud victims | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం

Oct 16 2014 10:09 PM | Updated on May 29 2018 2:28 PM

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం - Sakshi

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం

హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుకు వచ్చారు.

హైదరాబాద్: హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుకు వచ్చారు. ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు. ఈ మొత్తాన్ని వైఎస్సార్ ఫౌండేషన్, సాక్షి మీడియా గ్రూపు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సహాయనిధికి విరాళంగా ప్రకటించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు వారీ నిర్ణయం తీసుకున్నారు.

హుదూద్ తుపాను బాధితులకు సహాయం అందించేందుకు వైఎస్సార్ ఫౌండేషన్, ‘సాక్షి’ సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తొలి విరాళాన్ని ప్రకటించారు. తన వంతుగా ఆయన రూ. 50 లక్షల విరాళాన్ని బుధవారం ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement