మంత్రి గోపాలకృష్ణ అనుచరులే కబ్జా చేశారు | ysrcp leaders protest against ministers supporters land occupations | Sakshi
Sakshi News home page

మంత్రి గోపాలకృష్ణ అనుచరులే కబ్జా చేశారు

Sep 11 2014 12:40 PM | Updated on Apr 3 2019 5:55 PM

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలో టీడీపీ నేతలు వెయ్యి ఎకరాల భూకబ్జాకు పాల్పడ్డారని వైఎస్ఆర్ సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జి బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు.

శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలో టీడీపీ నేతలు వెయ్యి ఎకరాల భూకబ్జాకు పాల్పడ్డారని వైఎస్ఆర్ సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జి బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణ అనుచరులే కబ్జా చేశారని ఆయన అన్నారు. దళితుల పొట్టగొట్టి టీడీపీ నేతలు రూ.కోట్లు సంపాదిస్తున్నారని మధుసూదన్ రెడ్డి ధ్వజమెత్తారు. వెయ్యి ఎకరాల భూకబ్జాపై సీబీపీ విచారణ చేయించాలంటూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ నేతలు గురువారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ దళిత రైతులకు న్యాయం జరిగేవరకు వైఎస్ఆర్ సీపీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు.

బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సొంత మండలంలో టీడీపీ నాయకులు సుమారు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడం రాష్ట్రంలో ఇదే ప్రథమం అన్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement