‘నంద్యాల సభ చూసి భయంతో రోడ్లెక్కుతున్నారు’ | ysrcp leader parthasarathy slms tdp | Sakshi
Sakshi News home page

‘నంద్యాల సభ చూసి భయంతో రోడ్లెక్కుతున్నారు’

Aug 7 2017 1:20 PM | Updated on Aug 10 2018 8:27 PM

‘నంద్యాల సభ చూసి భయంతో రోడ్లెక్కుతున్నారు’ - Sakshi

‘నంద్యాల సభ చూసి భయంతో రోడ్లెక్కుతున్నారు’

వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి నంద్యాలలో నిర్వహించిన బహిరంగ సభను చూసి భయంతో టీడీపీ నేతలు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారని వైఎస్‌ఆర్సీపీ నేత కె.పార్థ సారథి విమర్శించారు.

విజయవాడ: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి నంద్యాలలో నిర్వహించిన బహిరంగ సభను చూసి భయంతో టీడీపీ నేతలు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారని వైఎస్‌ఆర్సీపీ నేత కె. పార్థ సారథి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలుకు ఇచ్చిన 28 హామీలలో ఎన్ని చేసారో జగన్ అడిగినా సమాధానం కూడా చెప్పలేని పరిస్థితిలో మంత్రులు ఉన్నారని అన్నారు.
 
రాజకీయ స్వార్దం కోసం, ఓట్ల కోసం రూ. 1200 కోట్లను నంద్యాలకు కేటాయించారని చెప్పారు. సభ్యతా, సంస్కారం గురించి  మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ నేతలకు దమ్ము, నైతిక విలువలు ఉంటే ఫిరాయింపుదారుల చేత రాజీనామా చేయించాలని సవాల్‌ విసిరారు.

Advertisement
 
Advertisement
Advertisement