చంద్రబాబుది ఎలుగుబంటి పాలన.. | YSRCP Leader Battula Brahmananda reddy Fire On Chandrababu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబుది ఎలుగుబంటి పాలన..జగన్‌ది కామధేనువు పాలన’

Aug 8 2019 12:59 PM | Updated on Aug 8 2019 2:37 PM

YSRCP Leader Battula Brahmananda reddy Fire On Chandrababu - Sakshi

సాక్షి, ప్రకాశం: గత ఐదేళ్ల పాలనలో ప్రజా సమస్యలు గాలికొదిలిన చంద్రబాబు..నేడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మనందరెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబు రాజకీయాలను వ్యాపారం చేశారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పోలవరం నిర్మాణం కలని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

గత ప్రభుత్వం హయాంలో నీరు-చెట్టు పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని పేరుతో రైతుల భూములను బలవంతంగా గుంజుకుని అన్యాయం చేశారని నిప్పులు చెరిగారు. భూములను తన కోటరిలోని నాయకులకు పంచిపెట్టి.. రైతులను నిలువునా మోసం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబుది ఎలుగుబంటి పాలన అయితే..ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ది కామధేనువు పాలనగా బ్రహ్మనందరెడ్డి అభివర్ణించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement