'చంద్రబాబు...ఓ దుబారా బాబు' | YSRCP leader ambati rambabu fire on Andhra pradesh cm chandra babu naidu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు...ఓ దుబారా బాబు'

Feb 3 2015 1:45 PM | Updated on May 29 2018 4:18 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబారా బాబుగా మారారని వైఎస్ఆర్ సీపీ అధికారి ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబారా బాబుగా మారారని వైఎస్ఆర్ సీపీ అధికారి ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదంటూనే రూ.కోట్లు ఖర్చుపెడుతున్నారంటూ బాబుపై మండిపడ్డారు. నీతులు ఎదుటివారికే కానీ మాకు కాదన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

విమానాల్లో తిరుగుతూ రూ.కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసమని, పట్టిసీమకు రూ.1300 కోట్లు కేటాయింపులు ఎందుకని,  కాంట్రాక్టర్లను మేపడానికేనా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు యోగా పాఠాలు ప్రజల నుంచి వచ్చే ఒత్తిడిని నియంత్రించుకోవడానికేనని ఆయన అన్నారు.

విదేశీ పర్యటనలకు ఎన్నికోట్లు ఖర్చుపెట్టారో వెల్లడించాలని  అంబటి  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అవ్వకముందే పబ్లిసిటీ పేరుతో పత్రికల్లోరూ.కోట్లు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇచ్చారని గుర్తు చేశారు. బాబు పాలన తుగ్లక్ను తలపిస్తోందని, ఇదేనా పాలనా దక్షత అంటూ ప్రశ్నలు సంధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement