పెట్టుబడులు, ఉద్యోగాలు ఏమయ్యాయి? | YSRCP Fight On BC Rights Says Janga Krishna Murthy | Sakshi
Sakshi News home page

పెట్టుబడులు, ఉద్యోగాలు ఏమయ్యాయి?

Jan 20 2019 12:55 PM | Updated on Jan 20 2019 5:11 PM

YSRCP Fight On BC Rights Says Janga Krishna Murthy - Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో బీసీలకు ఎన్నో హామీలు ఇచ్చి నిలువునా మోసం చేశారని వైఎస్సార్‌సీపీ బీసీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణామూర్తి విమర్శించారు. 20లక్షల కోట్ల పెట్టుబడులు, 40లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మభ్యపెట్టారని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెట్టుబడులు, ఉద్యోగాలు ఏమయ్యాయని నిరుద్యోగులు చంద్రబాబుని  ప్రశ్నిస్తున్నారని తెలిపారు.

రాష్ట్రం ఏర్పడి నాలుగున్నరేళ్లు గడిచినా ఇప్పటివరకే ఒకేఒక్కసారి డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రం అధిక జనాభా ఉన్న బీసీలకు ఏపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో తీవ్ర అన్యాయం జరుగుతోందని, బీసీలకు అన్యాయం చేసే విధంగా నిభందనలు అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. బీసీలపై జరుగుతున్న అన్యాయాలపై వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తోందని, దీనిపై సీఎస్‌కు లేఖ కూడా రాశామని ఆయన వెల్లడించారు.

గతంలో మెడికల్‌ సీట్ల భర్తీలో బీసీలకు అన్యాయం జరిగితే వైఎస్సార్‌సీపీ పోరాటం చేసిందని జంగా కృష్ణమూర్తి గుర్తుచేశారు. రాష్ట్రంలో 2.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే నోటిఫికేషన్‌ ఎందుకు ఇవ్వట్లేదని ఆయన ప్రశ్నించారు.  


 

Advertisement
 
Advertisement
Advertisement