పంకా..  విజయ ఢంకా.. తేల్చిన ఎగ్జిట్‌ పోల్స్‌

YSR Congress Party Ranks Are Happy With The Results Of Exit Polls - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పంకా.. విజయ ఢంకా ఖాయమని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు రావడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని, అధికారంలోకి రా వడం ఖాయమనే సంకేతాలతో జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ సీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోని రాబోతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడించాయి.

లోక్‌సభ ఎన్నికల్లోనూ టీడీపీ కంటే వైఎస్సార్‌ సీపీ అధిక స్థానాలు గెలుచుకుటుందని జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ తేటతెల్లం చేశాయి. సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూసిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఆదివారం సాయంత్రం వెల్లడయ్యాయి. తొలిసారిగా ఒంటరిగా బరిలోకి దిగిన టీడీపీకి అధికార వియోగం తప్పదని ముక్తకంఠంతో తేల్చా యి.

పవన్‌కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్ల డైంది. టీడీపీతో అంటకాగుతున్న లగడపాటి రాజగోపాల్‌ మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని చెప్పారు. ఒకటి రెండు పచ్చ చానళ్లు మినహా రాష్ట్రంలో సర్వేలు చేసిన సంస్థలు, జాతీయస్థాయి సంస్థలు అన్నీ వైఎస్సార్‌ సీపీకే పట్టం కట్టాయి. ఫ్యాన్‌ గాలికి అధికారపక్షం తుడిచిపెట్టుకుపోతుందని అంటున్నాయి. 

పశ్చిమలో మెజార్టీ స్థానాలు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 120 నుంచి 135 స్థానాల వరకూ వస్తాయని ఎక్కువ సర్వేలు చెప్పాయి. పశ్చిమగోదావరి జిల్లాలో కూడా మెజారిటీ స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. గతంలో క్లీన్‌స్వీప్‌ చేసిన టీడీపీ నామమాత్రపు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుండగా, జనసేన జిల్లాలో ఖాతా తెరవదని అంచనాలు చెబుతున్నాయి. దీంతో ఒక్కసారిగా బెట్టింగ్‌లు నిలిచిపోయాయి.

నిన్నటివరకూ వైసీపీకు అధికారం వస్తుందని, ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై బెట్టింగులు జరగ్గా ఎగ్జిట్‌పోల్స్‌ తర్వాత కోసు పందేలకు కూడా టీడీపీ నాయకులు ముం దుకు రావడం లేదు. జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎవరు గెలు స్తారన్న దానిపై పందేలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపై ఎవరూ పందేలు కాయడం లేదని బెట్టింగ్‌రాయుళ్లు అంటున్నారు. లగడపాటి సర్వేను న మ్మే పరిస్థితి లేదని, ఆయన్ను నమ్మి మరోసారి మోసపోయే పరిస్థితి ఉండదని బెట్టింగ్‌ రాయుళ్లు స్పష్టం చేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top