నిబంధనలకు విరుద్ధంగా సభ నడుస్తోంది: వైఎస్ఆర్ సీపీ | YSR Congress party mlas takes on State Government | Sakshi
Sakshi News home page

నిబంధనలకు విరుద్ధంగా సభ నడుస్తోంది: వైఎస్ఆర్ సీపీ

Dec 17 2013 10:33 AM | Updated on Jul 29 2019 5:31 PM

తెలంగాణ బిల్లు వచ్చిన నేపథ్యంలో అసెంబ్లీలో తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు రావడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు.

తెలంగాణ బిల్లు వచ్చిన నేపథ్యంలో అసెంబ్లీలో తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు రావడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు.  మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ...  నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ నడుస్తోందని వెల్లడించారు.

 

నిన్నటి సభకు సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, స్పీకర్ నాదెండ్ల మనోహర్ దూరంగా ఉండటం అశ్చర్యకరంగా ఉందని అన్నారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ ప్రారంభమైందని మంత్రి చెప్పడం నిబంధనలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. సమైక్య తీర్మానం కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తాన్నారు.

 

టి.బిల్లుకు నిరసనగా అసెంబ్లీలో ఉన్న తమను అర్థరాత్రి నిర్ధాక్షణ్యంగా అరెస్ట్ చేశారని వారు తెలిపారు. మెజార్జీ సభ్యుల అభిప్రాయం మేరకే సభ జరగాలని వారు డిమాండ్ చేశారు. ఎజెండాను కూడా ఆ మేరకే ఖరారు చేయాలని వారు ప్రభుత్వానికి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement