18 నెలల కాలంలో వారు చేసిందేమీ లేదు | YSR Congress MLA criticized the TDP | Sakshi
Sakshi News home page

18 నెలల కాలంలో వారు చేసిందేమీ లేదు

Jan 4 2016 2:35 PM | Updated on May 25 2018 9:20 PM

టీడీపీ ప్రభుత్వం 18 నెలల కాలంలో ప్రజలకు చేసిందేమీ లేదని ఎర్రగొండపాలెం వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు విమర్శించారు.

టీడీపీ ప్రభుత్వం 18 నెలల కాలంలో ప్రజలకు చేసిందేమీ లేదని ఎర్రగొండపాలెం వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు విమర్శించారు. ఎర్రగొండపాలెంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే జన్మభూమి - మాఊరు కార్యక్రమం నిర్వహిస్తోందని అన్నారు. రెండో జన్మభూమి కార్యక్రమ సమయంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిష్కరించకుండా తిరిగి మూడో జన్మభూమి కార్యక్రమాలు నిర్వహిస్తూ సమయం వృథా చేస్తున్నారని టీడీపీ నాయకులపై మండిపడ్డారు.



 

Advertisement
 
Advertisement
Advertisement