breaking news
Palaparti David Raju
-
18 నెలల కాలంలో వారు చేసిందేమీ లేదు
టీడీపీ ప్రభుత్వం 18 నెలల కాలంలో ప్రజలకు చేసిందేమీ లేదని ఎర్రగొండపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు విమర్శించారు. ఎర్రగొండపాలెంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే జన్మభూమి - మాఊరు కార్యక్రమం నిర్వహిస్తోందని అన్నారు. రెండో జన్మభూమి కార్యక్రమ సమయంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిష్కరించకుండా తిరిగి మూడో జన్మభూమి కార్యక్రమాలు నిర్వహిస్తూ సమయం వృథా చేస్తున్నారని టీడీపీ నాయకులపై మండిపడ్డారు. -
14న ఐక్య క్రిస్మస్ వేడుకలు
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాళెంలో పార్టీలకతీతంగా ఈనెల ఘనంగా నిర్వహించనున్నమని వైఎస్సార్సీపీకి చెందిన ఎర్రగొండపాళెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు గురువారం ఇక్కడ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఐక్య క్రిస్మస్ వేడుకల పోస్టర్‌ను ఆవిష్కరించారు. -
మహాధర్నాను విజయవంతం చేయండి
ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు యర్రగొండపాలెం: టీడీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు డిసెంబర్ 5న జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద నిర్వహించే మహా ధర్నాను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు కోరారు. ధర్నాకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను శనివారం తన కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వాగ్దానం చేశారని..ఆ మోసపు మాటలు నమ్మిన ప్రజలు టీడీపీకి ఓట్లు వేసి ఆయన్ను గద్దెనెక్కించారన్నారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు విస్మరించి పూటకో మాట చెప్తోందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా సంక్షేమ పథకాలను నీరుగార్చుతున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా గ్రామాల్లోని రోడ్లపై ఒక తట్ట మట్టి కూడా చల్లలేదన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి పనులు చేయకపోగా పింఛన్లు రద్దు చేయడం, రేషన్‌షాపు డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం పనిగా పెట్టుకున్నారని అన్నారు. డిసెంబర్ 5న కలెక్టరేట్ ఎదుట జరిగే మహాధర్నాలో రాజకీయాలకు అతీతంగా రైతులు, మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు. సమావేశంలో ఎంపీపీలు చేదూరి విజయభాస్కర్, మాకం సుందరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి నర్రెడ్డి వెంకటరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.