రేపు విశాఖకు సీఎం వైఎస్‌ జగన్‌.. | YS Jagan Will Attend Anniversary Celebration Of Sarada Peetham | Sakshi
Sakshi News home page

రేపు విశాఖకు సీఎం వైఎస్‌ జగన్‌..

Feb 2 2020 8:31 PM | Updated on Feb 2 2020 8:40 PM

YS Jagan Will Attend Anniversary Celebration Of Sarada Peetham - Sakshi

సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం విశాఖపట్నం వెళ్లనున్నారు. పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవానికి సీఎం వైఎస్‌ జగన్‌ హాజరుకానున్నారు. రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం వైఎస్‌ జగన్‌ 9.20 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి  విమానంలో బయలుదేరి 10.10 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. 

అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 10.40 గంటలకు చినముషిడివాడలోని శారదా పీఠానికి సీఎం వైఎస్‌ జగన్‌ చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవ ముగింపు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం శారదాపీఠం నుంచి 12.50కి సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖ విమానాశ్రయానికి బయలుదేరుతారు. మధ్యాహ్నం 2.10 గంటలకు తాడేపల్లిలోని స్వగృహానికి చేరుకోనున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement