బానుకచర్ల హెడ్ రెగ్యులరేటర్ను పరిశీలించిన వైఎస్ జగన్ | YS Jagan team arrives at banukacharla | Sakshi
Sakshi News home page

బానుకచర్ల హెడ్ రెగ్యులరేటర్ను పరిశీలించిన వైఎస్ జగన్

Apr 17 2015 3:24 PM | Updated on Jul 25 2018 4:09 PM

బానుకచర్ల హెడ్ రెగ్యులరేటర్ను పరిశీలించిన వైఎస్ జగన్ - Sakshi

బానుకచర్ల హెడ్ రెగ్యులరేటర్ను పరిశీలించిన వైఎస్ జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బృందం కర్నూలు జిల్లా బానుకచర్ల డైవర్సన్ స్కీమ్ హెడ్ రెగ్యలరేటర్ పనులను పరిశీలించింది.

కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బృందం కర్నూలు జిల్లా బానుకచర్ల డైవర్షన్ స్కీమ్ హెడ్ రెగ్యులరేటర్ పనులను పరిశీలించింది. ప్రాజెక్టుల కోసం చేపట్టిన బస్సుయాత్రలో భాగంగా మూడో రోజు శుక్రవారం వైఎస్ జగన్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు.

పోతిరెడ్డిపాడు నుంచి బానుకచర్లకు 44 వేల క్యూసెక్కుల నీరు రావాల్సివుండగా, 3 నుంచి 4 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోందని వైఎస్ జగన్ విమర్శించారు. ఈ రోజు ఉదయం దోర్నాల నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. వైఎస్ జగన్ మాల్యాలలో హంద్రీ-నీవా ప్రాజెక్టును సందర్శించిన అనంతరం రైతులతో మాట్లాడనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement