విశాఖ చేరుకున్న వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy Receives Grand Welcome at visakha airport | Sakshi
Sakshi News home page

విశాఖ చేరుకున్న వైఎస్‌ జగన్‌

Apr 27 2019 6:58 PM | Updated on Apr 27 2019 7:16 PM

YS Jagan Mohan Reddy Receives Grand Welcome at visakha airport - Sakshi

సాక్షి, విశాఖ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు విశాఖ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ సోదరుడు కుమార్తె వివాహ వేడుకకు వైఎస్‌ జగన్‌ హాజరు కానున్నారు. గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కుమార్తె యామిని, విశాఖ నగరానికి చెందిన మునికోటి నిరంజనరావు, విజయలక్ష్మిల కుమారుడు రవితేజల వివాహం శనివారం రుషికొండ సమీపంలోని సాయిప్రియా రిసార్ట్స్‌లో జరగనుంది.

హైదరాబాద్‌ నుంచి విమానంలో వచ్చిన వైఎస్‌ జగన్‌ శనివారం సాయంత్రం ఆరు గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వివాహ వేదిక వద్దకు వెళతారు. నూతన వధూవరులను వైఎస్‌ జగన్‌ ఆశీర్వదించిన అనంతరం అదే రాత్రి హైదరాబాద్‌కు తిరిగి వెళతారు.

ఇక వైఎస్‌ జగన్‌ వెంట విశాఖ వంశీకృష్ణ శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ,  మళ్ళ విజయ్ ప్రసాద్, గుడివాడ అమర్నాథ్‌, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణరెడ్డి, అవంతి శ్రీనివాస్, అదీప్ రాజ్, చెట్టి ఫాల్గుణ, బూడి ముత్యాలనాయుడు, గొట్టేటి మాధవి, కోలా గురువులు, కుంభ రవిబాబు, ద్రోణంరాజు శ్రీనివాస్, కేకే రాజు, రొంగలి జగన్నాధం, కొండా రాజీవ్‌తో సహా సీనియర్ పార్టీ నేతలు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement