సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన వాయిదా | YS Jagan Mohan Reddy Pulivendula Visit Postponed | Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన వాయిదా

Aug 8 2019 8:27 AM | Updated on Aug 8 2019 8:29 AM

YS Jagan Mohan Reddy Pulivendula Visit Postponed - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

సాక్షి, పులివెందుల : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేటి(గురువారం) పులివెందుల పర్యటన వాయిదా పడింది. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఈమేరకు తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నందువలన గురువారం కూడా అక్కడే ఉండాల్సి రావడంతో పర్యటన వాయిదా పడిందన్నారు. మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌ ప్రధానమంత్రి నరేంద్రమోడిని కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరించడం జరిగిందన్నారు.

ఈ నేపథ్యంలో బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను కలిసి రాష్ట్ర పరిస్థితిపై చర్చించాల్సి ఉందన్నారు. కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ మృతి చెందిన నేపథ్యంలో కేంద్ర మంత్రులను కలవలేకపోయారన్నారు. గురువారం వారిని కలిసి రాష్ట్ర పరిస్థితులపై చర్చిస్తారన్నారు. పర్యటన వాయిదా పడినట్లు సీఎం కార్యాలయం నుంచి సమాచరం అందిందన్నారు. దివంగత మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి విగ్రహావిష్కరణ, పులివెందుల అభివృద్ధిపై అధికారుల, నాయకులతో సమీక్ష సమావేశం వాయిదా పడిందన్నారు.. మళ్లీ సీఎం ఎప్పుడు పర్యటించేది తరువత ఆయన కార్యాలయ వర్గాలు తెలియజేస్తాయన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement