అవినాష్‌కు ఫోన్‌లో వైఎస్‌ జగన్‌ పరామర్శ | ys jagan mohan reddy consoles devineni nehru family members | Sakshi
Sakshi News home page

అవినాష్‌కు ఫోన్‌లో వైఎస్‌ జగన్‌ పరామర్శ

Apr 17 2017 11:02 AM | Updated on Jul 25 2018 4:42 PM

అవినాష్‌కు ఫోన్‌లో వైఎస్‌ జగన్‌ పరామర్శ - Sakshi

అవినాష్‌కు ఫోన్‌లో వైఎస్‌ జగన్‌ పరామర్శ

మాజీమంత్రి దేవినేని నెహ్రూ మృతి పట్ల వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సంతాపం తెలిపారు.

హైదరాబాద్‌ : మాజీమంత్రి దేవినేని నెహ్రూ మృతి పట్ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. నెహ్రూ కుమారుడు అవినాష్‌తో ఆయన సోమవారం ఫోన్‌లో మాట్లాడారు.  ఆ కుటుంబానికి వైఎస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కాగా దేవినేని నెహ్రూ ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు నెహ్రూ మృతికి సంతాపం తెలిపారు. రేపు ఆయన అంత్యక్రియలు విజయవాడలో జరగనున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement