అక్క పెళ్లి కాకుండా నువ్వెలా పెళ్లి చేసుకుంటావ్‌! | Young woman commits suicide In Kadapa district | Sakshi
Sakshi News home page

అక్క పెళ్లి కాకుండా నువ్వెలా పెళ్లి చేసుకుంటావ్‌!

Jan 2 2019 11:55 AM | Updated on Jan 2 2019 11:55 AM

Young woman commits suicide In Kadapa district - Sakshi

ప్రమీద కొంత కాలం నుంచి ఒక యువకుడితో ..

ప్రొద్దుటూరు క్రైం : స్ధానిక దస్తగిరిపేటలో మోతుకూరు ప్రమీద (19) అనే యువతి మంగళారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దస్తగిరిపేటలో నివాసం ఉంటున్న ప్రమీద కొంత కాలం నుంచి ఒక యువకుడితో పరిచయం పెంచుకుంది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పి పెళ్లి చేయమని కోరింది. ప్రమీద కంటే పెద్ద కూతురికి పెళ్లి కాలేదు. ‘అక్క పెళ్లి కాకుండా ఎలా చేసుకుంటావని’ తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పారు. పెద్దలు తమ పెళ్లి చేయరేమోనని కలత చెందిన ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు చీర కట్టుకొని ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు వచ్చేసరికి ఆమె మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్‌ ఎస్‌ఐ మధుమళ్లేశ్వరరెడ్డి  తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement