'చంద్రబాబు ఇచ్చిన మాట తప్పారు' | y.visweswara reddy slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు ఇచ్చిన మాట తప్పారు'

Mar 13 2015 10:42 AM | Updated on Jun 4 2019 5:04 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట తప్పారని అనంతపురం జిల్లా ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు.

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట తప్పారని అనంతపురం జిల్లా ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు.  సభ  పదినిమిషాలు వాయిదా అనంతరం వై.విశ్వేశ్వరరెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీలపై ఇప్పుడు తుంగలోకి తొక్కారన్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ విషయంలో ప్రభుత్వం నిస్సిగ్గుగా మాటమార్చుతోందన్నారు.  

'అనంతపురం జిల్లాను దత్తత తీసుకుంటాం. అనంత జిల్లావాసులకు బిడ్డగా ఉంటా. రైతులను ఆదుకుంటాం' అని హామీలను చంద్రబాబు గుప్పించారన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ల గురించి అడిగితే గత ప్రభుత్వాలు చెప్పినవి మాకు సంబంధం లేదని ప్రభుత్వం చెబుతుందన్నారు. పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ మేము ఇవ్వం అని  ప్రభుత్వం... బహిరంగం చెప్పాలని వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. కరువు రైతుల్ని ఆదుకునే పద్దతి ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement