ఆ పార్టీలు ఏపీని గోదారిలో కలిపేస్తున్నాయి | wundavelli fires on central government | Sakshi
Sakshi News home page

ఆ పార్టీలు ఏపీని గోదారిలో కలిపేస్తున్నాయి

Apr 26 2015 11:44 AM | Updated on Mar 29 2019 9:31 PM

కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎద్దేవా చేశారు.

తూర్పుగోదావరి: కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని మాజీ ఎంపీ  ఉండవల్లి అరుణ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ, టీడీపీలు ఏపీ ప్రజల నిర్ణయాలను పుష్కర గోదావరిలో కలిపేస్తున్నాయని ఉండవల్లి మండిపడ్డారు. లోక్సభ సెషన్స్ పూర్తయ్యేలోగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వార్నింగ్ ఇవ్వాలి.. లేదంటే ప్రభుత్వం నుంచి బయటికి రావాలని టీడీపీకి సవాల్ విసిరారు. ఏపీ రీ ఆర్గనైజేషన్ చట్టం అమలు చేయాలని సుప్రీంకోర్టులో దావా వేయాలని సూచించారు. పదినెలల కాలంలో కేంద్రం ఏపీ కి ఏమీ ఇవ్వలేదని ఉండవల్లి  విమర్శించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement