కార్మికులు పీఎఫ్‌కు దరఖాస్తు చేసుకోవాలి | Workers Must A Apply For PF | Sakshi
Sakshi News home page

కార్మికులు పీఎఫ్‌కు దరఖాస్తు చేసుకోవాలి

Aug 29 2018 2:41 PM | Updated on Sep 2 2018 4:56 PM

Workers Must A Apply For PF - Sakshi

మాట్లాడుతున్న అసిస్టెంట్‌ కమిషనర్‌ సుధాకర్‌   

కాశీబుగ్గ శ్రీకాకుళం : కార్మికులంతా ఫ్రావిడెంట్‌ ఫండ్‌కు దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందాలని జిల్లా ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ జీ సుధాకర్‌ తెలిపారు. స్థానిక మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం మందిరంలో మంగళవారం కార్మికులకు ఆయన అవగాహన కల్పించారు.

ప్రతీ కార్మికుడు ఆధార్, పాన్, రేషన్‌కార్డు, కార్మికుని గుర్తింపుకార్డు, ఫోన్‌ నంబర్, బ్యాంకు ఖాతాతో నమోదు చేసుకోవాలన్నారు. కార్మికులు అవసరమైనపుడు ఇళ్లు, పిల్లల వివాహాలకు, ముఖ్యమైన సందర్భంలో వినియోగించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌ రమేష్‌నాయుడు, కార్మిక నాయకుడు మురగన్, సీఐటీయూ నాయకుడు ఎన్‌ గణపతి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement