ఆటో ఢీకొని మహిళ మృతి | women died in road accident | Sakshi
Sakshi News home page

ఆటో ఢీకొని మహిళ మృతి

Jan 23 2016 1:14 PM | Updated on Aug 30 2018 3:58 PM

రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న మహిళను ఆటో ఢీకొట్టటంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలొదిలింది.

మార్కాపురం: రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న మహిళను ఆటో ఢీకొట్టటంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలొదిలింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని ఎస్‌బీసీ కాలనీకి చెందిన దర్శనం విశ్రాంతమ్మ(45) రోడ్డు పక్కన నడిచి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement