ట్రాక్టర్ కిందపడి మహిళ మృతి | women died in road accident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ కిందపడి మహిళ మృతి

Aug 22 2015 2:30 PM | Updated on Aug 30 2018 3:56 PM

బైక్‌పై వెళ్తున్నమహిళ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందింది.

సాలూరు:  బైక్‌పై వెళ్తున్నమహిళ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందింది. ఈ సంఘటన శనివారం విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీ కేంద్రంలో జరిగింది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన బి. పార్వతమ్మ(60) తన మనవడితో కలిసి బైక్‌పై వెళ్తోంది. కాగా  ప్రమాదవశాత్తు రోడ్డు పనులకు నీటిని తరలిస్తున్న వాటర్ ట్యాంకర్(ట్రాక్టర్) కింద పడింది. ఆమె వెనుక టైరు కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement